
చెన్నై: నటుడు పశుపతి తమిళంతో పాటు తెలుగులో విభిన్న పాత్రలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. కాగా చాలాకాలం తరువాత పసుపతి మళ్లీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది.
ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రామ్ సంగైయ్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి రోహిణి, అమ్ము అభిరామి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కెఎస్ సుందరమూర్తి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర టైటిల్ ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని యూనిట్ వర్గాలు తెలిపాయి.
చదవండి: మెగా అభిమానం : క్యూబ్స్‌తో 6.5 ఫీట్ల చిరు ఫోటో
సలార్: బసిరెడ్డిని మించిన రాజమన్నార్!
Comments
Please login to add a commentAdd a comment