Trisha-Vijay: విజయ్‌ ఎప్పుడూ ప్రత్యేకమే! | Trisha Krishnan to Play Vijay Wife Role In Thalapathy 67 | Sakshi
Sakshi News home page

Trisha-Vijay: విజయ్‌ ఎప్పుడూ ప్రత్యేకమే!

Published Fri, Aug 12 2022 7:07 AM | Last Updated on Fri, Aug 12 2022 7:07 AM

Trisha Krishnan to Play Vijay Wife Role In Thalapathy 67 - Sakshi

కోలీవుడ్‌లో హిట్‌ పెయిర్‌గా విజయ్, త్రిష పేరు గడించారు. ఈ జంట ఇప్పటి వరకు నాలుగు చిత్రాలలో కలిసి నటించారు. వాటిలో గిల్లీ చిత్రం ఘన విజయం సాధించింది. తాజాగా మరోసారి కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. విజయ్‌ ప్రస్తుతం వారీసు చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రం చాలా భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఆయన తన 67వ చిత్రానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి మహానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్‌ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని టాక్‌. ఇందులో ఆరుగురు విలన్లు ఉంటారనే ప్రచారం వైరల్‌ అవుతోంది.

చదవండి: (స్లోగా వెళుతున్నాను తప్ప... డౌన్‌ కాలేదు)

ఇకపోతే చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో నటి త్రిష విజయ్‌తో రొమాన్స్‌ చేసే పాత్రలో నటించనున్నట్లు, సమంత ఆరుగురు విలన్లలో ఒకరిగా తనదైన విలనిజాన్ని ప్రదర్శించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాగా విజయ్‌తో మరోసారి జత కట్టనుండడం గురించి ఒక భేటీలో స్పందిస్తూ విజయ్‌ తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని త్రిష పేర్కొన్నారు. ఆయన ప్రొఫెషలిజం, అంకిత భావం తనకు నచ్చుతాయన్నారు.

సెట్‌లో చాలా సైలెంట్‌గా ఉంటారని, గిల్లీ చిత్రం తమ మధ్య ఫ్రెండ్‌షిప్‌ను పెంచిందని చెప్పారు. తాను మంచి కథా చిత్రాలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈమె మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం సెప్టెంబర్‌ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక విజయ్‌తో 14 ఏళ్ల తరువాత నటించనున్న తాజా చిత్రం నవంబర్‌ 3వ వారంలో సెట్స్‌ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement