
అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. కానీ చిరంజీవి మాత్రం కళాకారులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వారు నోరు తెరిచి అడగకముందే కావాల్సింది సమకూర్చుతాడు, ఆర్థికంగా ఆదుకుంటాడు, చికిత్స చేయించేందుకు చర్యలు తీసుకుంటాడు, వెన్నంటే ఉంటూ మనోధైర్యాన్ని కల్పిస్తాడు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు.
తాజాగా ఈ హీరో ఓ సీనియర్ నటుడిని ఆదుకున్నాడు. పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని తెలిసిన చిరంజీవి వెంటనే అతడికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. కష్టకాలంలో తనను దేవుడిలా ఆదుకున్నందుకు అతడు భావోద్వేగానికి లోనయ్యాడు. 'చిరంజీవి అన్నయ్యకు నమస్కారం. చాలా థ్యాంక్స్ అన్నా. నాకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం మీరు పంపిన రెండు లక్షల రూపాయలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. మీకు మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ పేరుతో ఉన్న ఆంజనేయ స్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని మనసారా కోరుకుంటూ.. జై శ్రీరామ్' అని పొన్నాంబళం తమిళంలో తన సందేశాన్ని తెలియజేశాడు.
Comments
Please login to add a commentAdd a comment