ఆ సినిమాలో నటిస్తే బాగుండేది: క్రికెటర్ | Ashwin bats for Chennai 28 sequel | Sakshi
Sakshi News home page

ఆ సినిమాలో నటిస్తే బాగుండేది: క్రికెటర్

Published Tue, Dec 27 2016 4:06 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 PM

ఆ సినిమాలో నటిస్తే బాగుండేది: క్రికెటర్

ఆ సినిమాలో నటిస్తే బాగుండేది: క్రికెటర్

క్రికెట్ నేపథ్యంగా తాజాగా తమిళంలో వచ్చిన సినిమా చెన్నై 28. గల్లీ క్రికెట్ నేపథ్యంగా యువత జీవితాల్లో ఈ క్రీడ ఎలా భాగమయిందో వివరిస్తూ రూపొందిన ఈ సినిమాపై టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మనస్సు పడ్డాడు. ఇటీవల ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన అశ్విన్ ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు.

'చెన్నై 28 (2) చాలా మంచి సినిమా. నా జీవితం మొత్తాన్ని తిప్పి చూసుకున్నట్టు ఉంది ఈ సినిమాను చూస్తే. ఈ సినిమాలో నేను కూడా భాగమై ఉంటే బాగుండేది అనిపించింది' అని అశ్విన్ ట్వీట్ చేశాడు. 2007లో వచ్చిన చెన్నై-28 సినిమాకు ఈ సినిమా సీక్వెల్. ఈ సినిమాలో అశ్విన్ తో అతిథి పాత్ర చేయించాలని తాము కూడా అనుకున్నామని, అది కుదరలేదని, మూడో పార్టు గనుక తీస్తే అందులో అశ్విన్ ను తీసుకుంటామని చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభూ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement