
ఇక్కడే పుట్టాను
తమిళసినిమా: చెన్నైలో గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోçషంగా ఉంది. నేను తమిళనాడు నీళ్లు తాగి పెరిగాను. చెన్నైలోనే పుట్టాను. నేను మీలో ఒకరినే. తమిళం, తెలుగు అని కాకుండా మనమంతా భారతీయులం. అని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. ఆయన నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు అదే పేరుతో తమిళంలో అనువాదం అవుతోంది.
ఆర్‌ఎన్‌సీ సినిమా పతాకంపై రఘునాధ్ సమర్పణలో నరేంద్ర తమిళంలోకి అనువధిస్తున్న ఈ చిత్ర తమిళ వెర్షన్‌కు మరుదభరణి సంభాషణలు రాశారు. పాటలను వైరముత్తుతో కలిసి మరుదభరణి రాశారు. చిరంధన్ భట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక ట్రిప్లికేన్‌లోని కలైవానర్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు బాలకృష్ణ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రావడం విశేషం. కాగా నటుడు కార్తీ ముఖ్య అతిథిగా పాల్గొన్ని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. దర్శకుడు కేఎస్.రవికుమార్ తొలి ప్రతిని అందుకున్నారు. కార్యక్రమానికి చెన్నైలోని బాలకృష్ణ అభిమానులతో పాటు నెల్లూరు నుంచి ఎన్‌బీకే ఫాన్స్ సంఘం అధ్యక్షుడు శివ నేతృత్వంలో పలువురు అభిమానులు హాజరయ్యారు.