శ్రీదేవికి చిరు కోపం కూడా రాలేదు! | Sridevi did not even get to the petty anger | Sakshi
Sakshi News home page

శ్రీదేవికి చిరు కోపం కూడా రాలేదు!

Published Tue, Feb 3 2015 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

శ్రీదేవికి చిరు కోపం కూడా రాలేదు!

శ్రీదేవికి చిరు కోపం కూడా రాలేదు!

సుదీర్ఘ కాలం తరువాత శ్రీదేవి తమిళ సినిమాలో నటిస్తున్న విషయం సినీ అభిమానులకు తెలిసిన విషయమే. విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ ఫాంటసీ డ్రామాకు ‘పులి’ అని నామకరణం చేశారు. ‘‘టైటిల్ బాగా నచ్చింది. ఈ సినిమాకు పనిచేయడం అద్భుతమైన అనుభవం’’ అని శ్రీదేవి ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నారు. శ్రీదేవి వెండితెర మీద పెద్దగా కనిపించకపోయినా ఆమె స్టార్‌డమ్, ఫాలోయింగ్ ఏమీ తగ్గలేదు. చాలామంది అభిమానులకు ఆమె ఇప్పటికీ ‘అతిలోక సుందరే!’ ఆమె సినిమా చేస్తానంటే క్యూకట్టే నిర్మాతలకు కూడా కొదవలేదు.

మరి అలాంటి శ్రీదేవికి ‘పులి’ చిత్రం షూటింగ్‌లో... మిస్‌మేనేజ్‌మెంట్ వల్ల అసౌకర్యానికి గురికావాల్సి వచ్చిందట! అయినప్పటికీ ఆమె చాలా హుందాగా ప్రవర్తించారట! సహనటి హన్సిక పుణ్యమా అని... తన షాట్ కోసం శ్రీదేవి నాలుగు గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చిందట! శ్రీదేవి స్థానంలో వేరొకరు ఉండి ఉంటే అగ్గిమీద గుగ్గిలం అయ్యేవారని... అతిలోక సుందరి మాత్రం చిరు కోపం కూడా ప్రదర్శించలేదని  అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement