ఇన్నేళ్లల్లో చేయని పాత్ర అది! | Vijay plays gladiator and Sridevi plays queen in Chimbu Devan’s next! | Sakshi
Sakshi News home page

ఇన్నేళ్లల్లో చేయని పాత్ర అది!

Published Sat, Nov 15 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

ఇన్నేళ్లల్లో చేయని పాత్ర అది!

ఇన్నేళ్లల్లో చేయని పాత్ర అది!

 శ్రీదేవి సినిమాలు చేయడం మానేసిన తర్వాత ఆమె అభిమానులు తెగ బాధపడిపోయారు. దాదాపు పధ్నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ చిత్రం ద్వారా తెరపై కనిపించినప్పుడు పరమానందపడిపోయారు. ఈ చిత్రం తర్వాత శ్రీదేవి వెంటనే మళ్లీ సినిమాలు అంగీకరించలేదు. మంచి పాత్రలు మాత్రమే అంగీకరించాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి పచ్చజెండా ఊపారామె.ఇన్నేళ్ల కెరీర్‌లో చేయని గొప్ప పాత్రను ఇందులో చేస్తున్నానని శ్రీదేవి తెలిపారు.
 

విజయ్ మేనేజర్ పీటీ సెల్వకుమార్, విజయ్ చిత్రాలను మలయాళంలో విడుదల చేసిన శింబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విజయ్, శ్రీదేవి, కథానాయికల్లో ఒకరైన హన్సిక, కీలక పాత్ర చేస్తున్న సుదీప్, వందమంది డాన్సర్లపై పాటను చిత్రీకరిస్తున్నారు. చెన్నయ్‌లోని ఆదిత్యారామ్ స్టూడియోలో నిర్మించిన ఐదు భారీ సెట్స్‌లో 60 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement