
తమిళసినిమా: కథకు అవసరం అయినందువల్లే అర్ధనగ్న సన్నివేశాలను ఎక్స్ వీడియోస్ చిత్రంలో పొందుపరచినట్లు ఆ చిత్ర దర్శకుడు సజో సుందర్ అంటున్నారు. దర్శకుడు హరి శిష్యుడైన ఈయన తెరకెక్కించిన తొలి చిత్రం ఇది. కలర్ షాడోస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అజయ్‌రాజ్, ప్రభుజిత్, అహిరుతిసింగ్, రియామిక, షాన్ ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాణ దశ నుంచి సంచలనంగా మారిన ఎక్స్ స్టూడియోస్ చిత్రం తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కి శుక్రవారం తెరపైకి రానుంది చిత్ర దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించిన పలు సందేహాలకు వివరణ ఇస్తూ ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లనేవి స్త్రీల నగ్న దృశ్యాలను, అశ్లీల దృశాలను విడుదల చేస్తూ సమాజాన్ని చెడ గొడుతున్నాయని చెప్పే చిత్రంగా ఎక్స్ వీడియోస్ చిత్రం ఉంటుందన్నారు. ఈ ఇంటర్నెట్‌లు ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయన్నది చిత్రంలో చెప్పామన్నారు. అలా ఇది ఎక్స్ స్టూడియోస్ అనే ఇంటర్నెట్‌కు వ్యతిరేకంగా ఆవిష్కరించిన చిత్రం అని చెప్పారు.
ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంటుందనే అదే టైటిల్‌ను చిత్రానికి నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా ఎక్స్ అనే పదమే తప్పు అని ఈ చిత్రంలో చెప్పినట్లు పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఇది మహిళలకు అవగాహన కలిగించే చిత్రంగా ఉంటుందన్నారు. కన్నుకు తెలియని బ్రహ్మాండ సైబర్ ప్రపంచం జరుగుతోందన్నారు. అవి మనకు తెలియడం లేదుగానీ, మనల్ని 24 గంటలు చుట్టి తిరుగుతోందన్నారు. అందులో మన అంతరంగ విషయాలన్నీ బహిరంగమేనని అన్నారు. మన ఇంట్లో బాత్‌రూమ్, బెడ్ రూమ్‌లోనో మన స్మార్ట్‌ఫోన్ ఉంటే దానిలోని ఆప్షన్లతో ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి మీ ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చునన్నారు. ఇలాంటి విషయాలను ఆవిష్కరించే చిత్రంగా ఎక్స్ స్టూడియోస్ చిత్రం ఉంటుందని వివరించారు. ఇందులో నగ్న దృశ్యాలు చోటు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.
అయితే అర్ధనగ్న దృశ్యాలు మాత్రం కథ డిమాండ్ చేయడంతో పొందుపరచినట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించిన వారెవరూ ఇంతకు ముందు ద్వందార్థాల కథా చిత్రాల్లో నటించలేదని అన్నారు. ఈ చిత్రంలో సమాజానికి కావలసిన విషయం ఉండడంతో ఇందులో నటించడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బృందంలో 7 గురు మహిళా సభ్యురాళ్లు ఉన్నారని తెలి పారు. అందులో ఒకరైన నటి గౌతమి ఎక్స్ స్టూడియోస్ లాంటి చిత్రాలు సమాజానికి అవసరమని, మరిన్ని విషయాలతో దీని రెండవ భాగాన్ని కూడా రూపొందించమని సలహా ఇచ్చారని దర్శకుడు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment