Nude scenes
-
‘నగ్న సీన్ల కోసం నా పై ఒత్తిడి చేశారు’
రెండో ప్రపంచ యుద్ధానంతర పరిస్థితులకు సంబంధించి 2016లో బీబీసీ నెట్వర్క్ కోసం తీసిన ‘క్లోజ్ టు ది ఎనిమీ’ మినీ సిరీస్ షూటింగ్ సందర్భంగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ పొలియాకాఫ్ తనపై నగ్న సీన్ల చిత్రీకరణ కోసం ఒత్తిడి చేశారని 34 ఏళ్ల ఎమిలియా క్లార్క్ ఆరోపించారు. అందుకు తాను అంగీకరించకుండా సిరీస్ నుంచి తప్పుకున్నానని తాజా హాలీవుడ్ చిత్రం ‘హ్యూమన్’లో హీరోయిన్గా నటించిన ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సిరీస్‌కు రచయిత, దర్శకుడు స్టీఫెన్ పొలియాకాఫే. ఆయనకిప్పుడు 67 ఏళ్లు. ‘క్లోజ్ టు ది ఎనిమీ’ సిరీస్ నుంచి తప్పుకున్న ఆమె ‘సన్స్ ఆఫ్ లిబర్టీ’లో నటించారు. అది హిట్ కాకపోవడంతో ఆమెకు అంతగా పేరు రాలేదు. అయితే ఎమిలియా చేసిన ఆరోపణలను ‘బాఫ్టా’ అవార్డు గ్రహీత స్టీఫెన్ ఖండించారు. ఆమె ప్రస్తుతం ఉన్న స్థితికి చింతిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.‘నగ్న సీన్ల కోసం ఎంతసేపు బట్టలు లేకుండా ఉండాలి. ఏ పార్టులో బట్టలు లేకుండా ఉండాలి. నాపై లైట్ ఫోకస్ ఎలా ఉంటుంది?’ అని తానడగడంతో దర్శకుడికి కోపం వచ్చిందని, తాను ఏది ఎలా తీయదల్చుకుంటే అలాగే తీస్తానంటూ గొడవ చేశారని ‘ది గార్డియన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆరోపించారు. ఈ విషయమై పత్రిక స్టీఫెన్ వివరణ కోరగా ‘ఎమిలియా క్లార్క్ ప్రస్తుతమున్న స్థితికి నేను చింతిస్తున్నాను. ఆ రోజులో ఏం జరిగిందనేది వరుసగా నేను గుర్తు చేయదల్చుకోలేదు. వాస్తవానికి సినిమా షూటింగ్‌కు ముందే ఆమె పాత్ర గురించి మా మధ్య చర్చకు వచ్చింది. మగ వాళ్లయినా, ఆడవాళ్లయినా నగ్నంగా నటించాలంటే ఎంత బాధ పడతారో, ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు. వారిని అలా నేను బాధ పెట్టను. నాది సున్నితమైన మనసు’ అని ఆయన వివరణ ఇచ్చారు. ‘మీటూ’ ఉద్యమం కింద ఎంతోమంది హాలీవుడ్ తారలు దర్శక, నిర్మాతలపై ఇలాంటి ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. సెక్స్ సీన్లలో నటించడం ఇష్టం లేక తాను కూడా ఓ సినిమా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు గత డిసెంబర్ నెలలో బ్రిటీష్ తార రుత్ విల్సన్ ప్రకటించారు. -
అవసరమైనందుకే ఆ సన్నివేశాలు!
తమిళసినిమా: కథకు అవసరం అయినందువల్లే అర్ధనగ్న సన్నివేశాలను ఎక్స్ వీడియోస్ చిత్రంలో పొందుపరచినట్లు ఆ చిత్ర దర్శకుడు సజో సుందర్ అంటున్నారు. దర్శకుడు హరి శిష్యుడైన ఈయన తెరకెక్కించిన తొలి చిత్రం ఇది. కలర్ షాడోస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అజయ్‌రాజ్, ప్రభుజిత్, అహిరుతిసింగ్, రియామిక, షాన్ ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాణ దశ నుంచి సంచలనంగా మారిన ఎక్స్ స్టూడియోస్ చిత్రం తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కి శుక్రవారం తెరపైకి రానుంది చిత్ర దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించిన పలు సందేహాలకు వివరణ ఇస్తూ ఈ రోజుల్లో ఇంటర్నెట్లనేవి స్త్రీల నగ్న దృశ్యాలను, అశ్లీల దృశాలను విడుదల చేస్తూ సమాజాన్ని చెడ గొడుతున్నాయని చెప్పే చిత్రంగా ఎక్స్ వీడియోస్ చిత్రం ఉంటుందన్నారు. ఈ ఇంటర్నెట్లు ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయన్నది చిత్రంలో చెప్పామన్నారు. అలా ఇది ఎక్స్ స్టూడియోస్ అనే ఇంటర్నెట్కు వ్యతిరేకంగా ఆవిష్కరించిన చిత్రం అని చెప్పారు. ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంటుందనే అదే టైటిల్‌ను చిత్రానికి నిర్ణయించినట్లు తెలిపారు. అదే విధంగా ఎక్స్ అనే పదమే తప్పు అని ఈ చిత్రంలో చెప్పినట్లు పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే ఇది మహిళలకు అవగాహన కలిగించే చిత్రంగా ఉంటుందన్నారు. కన్నుకు తెలియని బ్రహ్మాండ సైబర్ ప్రపంచం జరుగుతోందన్నారు. అవి మనకు తెలియడం లేదుగానీ, మనల్ని 24 గంటలు చుట్టి తిరుగుతోందన్నారు. అందులో మన అంతరంగ విషయాలన్నీ బహిరంగమేనని అన్నారు. మన ఇంట్లో బాత్రూమ్, బెడ్ రూమ్‌లోనో మన స్మార్ట్‌ఫోన్ ఉంటే దానిలోని ఆప్షన్లతో ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి మీ ఫోన్‌ను ఆపరేట్ చేయవచ్చునన్నారు. ఇలాంటి విషయాలను ఆవిష్కరించే చిత్రంగా ఎక్స్ స్టూడియోస్ చిత్రం ఉంటుందని వివరించారు. ఇందులో నగ్న దృశ్యాలు చోటు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అయితే అర్ధనగ్న దృశ్యాలు మాత్రం కథ డిమాండ్ చేయడంతో పొందుపరచినట్లు చెప్పారు. ఈ చిత్రంలో నటించిన వారెవరూ ఇంతకు ముందు ద్వందార్థాల కథా చిత్రాల్లో నటించలేదని అన్నారు. ఈ చిత్రంలో సమాజానికి కావలసిన విషయం ఉండడంతో ఇందులో నటించడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బృందంలో 7 గురు మహిళా సభ్యురాళ్లు ఉన్నారని తెలి పారు. అందులో ఒకరైన నటి గౌతమి ఎక్స్ స్టూడియోస్ లాంటి చిత్రాలు సమాజానికి అవసరమని, మరిన్ని విషయాలతో దీని రెండవ భాగాన్ని కూడా రూపొందించమని సలహా ఇచ్చారని దర్శకుడు అన్నారు. -
న్యూడ్ సీన్లపై హీరోయిన్ సంజన వివరణ
బెంగళూరు: త్వరలో విడుదల కానున్న దండుపాళ్యం-2 సినిమాలోని వివాదాస్పద నగ్న దృశ్యాలపై హీరోయిన్ సంజన వివరణ ఇచ్చారు. బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. సినిమాలో అలాంటి సీన్లు చేయాల్సి ఉంటుందని తనతో దర్శకనిర్మాతలు ముందే చెప్పారని అన్నారు. అయితే సదరు దృశ్యాల చిత్రీకరణ సమయంలో తాను నిండుగా దుస్తులు ధరించానని, ఆ తర్వాత గ్రాఫిక్స్ ద్వారా వాటిని నగ్నంగా ఉన్నట్లు చూపించారని తెలిపింది. అయితే అశ్లీలత ఎక్కువైందనే కారణంగా దండుపాళ్యం 2లోని ఆ దృశ్యాలకు సెన్సార్ బోర్డు కట్ చెప్పడం, వాటిని తొలిగించిన మీదట సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించడం తెలిసిందే. కానీ అంతలోనే తొలగించిన సీన్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో సినిమాపై వివాదం రాజుకుంది. ఆ దృశ్యాలు ఎలా లీకయ్యాయో తెలియదని హీరోయిన్ సంజన చెప్పుకొచ్చారు. దర్శకుడిపై ఫిర్యాదు లీకైన వీడియోలపై దుమారం కొనసాగుతుండగానే, దండుపాళ్యం దర్శకుడిపై కన్నడ చిత్రసీమలో ఆగ్రహం వ్యక్తమైంది. ఒక నటిని నగ్నంగా చూపించడంపై కొందరు చిత్రమండలిలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
'ఆ జంట ఏకాంతంగా ఉన్న సమయంలోనే చిత్రీకరించారు'
-
'ఆ జంట ఏకాంతంగా ఉన్న సమయంలోనే చిత్రీకరించారు'
హైదరాబాద్: నగర శివార్లులోని సంఘీ టెంపుల్ సమీపంలో ప్రేమ జంటపై దాడి, నగ్న దృశ్యాలకు సంబంధించి ఏసీపీ భాస్కర్ స్పందించారు. ఈ ఘటనపై గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ జంట ఏకాంతంగా ఉన్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు వారిని సెల్ ఫోన్ లో చిత్రీకరించిన అనంతరం బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ క్రమంలోనే ఆ యువతి కూడా వచ్చిన యువకుడు పారిపోవడంతో ఆమెపై ఇద్దరు నిందితులు అత్యారానికి ఒడిగట్టారన్నారు. ఈ విషయాన్ని బయటకు చెబితే ఇంటర్ నెట్ లో పెడతామని బెదిరించినట్లు ఏసీపీ తెలిపారు. తొలుత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడిందని.. ఆ తరువాత ఆమె ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశామన్నారు. ఆ నిందితుల నుంచి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రస్తుతం సెల్ ఫోన్ ను ఫోరెనిక్స్ ల్యాబ్ కు పంపామని.. ఆ నివేదిక వచ్చాక చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. ఆ నిందితులు పెద్ద అంబర్ పేటకు చెందిన వెల్డర్ నల్లబోను శ్రీనివాస్ రెడ్డి, మెకానిక్ బండి లింగారెడ్డిలుగా గుర్తించామన్నారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని ఏసీపీ భాస్కర్ తెలిపారు. -
శివార్లలో మరో ‘స్నేక్ గ్యాంగ్’
-
శివార్లలో మరో ‘స్నేక్ గ్యాంగ్’
సంఘీ టెంపుల్ సమీపంలో ప్రేమజంటపై దాడి యువతిపై సామూహిక అత్యాచారం.. నగ్న దృశ్యాలు చిత్రీకరించి బెదిరింపులు బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి... ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్: నగరంలో మహిళలపై స్నేక్ గ్యాంగ్ దురాగతాలు మరచిపోక ముందే శివార్లలో ఇలాంటి దారుణమే మరోటి చోటుచేసుకుంది. హయత్‌నగర్ సమీపంలోని సంఘీ టెంపుల్‌కు వెళ్తున్న ప్రేమజంటపై దాడి చేసిన దుండగులు యువకుడిని తాళ్లతో కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమె నగ్నంగా ఉన్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు దిగారు. ఆ మృగాళ్ల వేధింపులు భరించలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన యువతి (22), యువకుడు (26) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు ద్విచక్రవాహనంపై సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సంఘీ దేవాలయానికి వెళ్తున్నారు. గుడికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉండగా వీరిని పెద్ద అంబర్‌పేట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. కొద్దిదూరం వెళ్లాక వారిని అడ్డగించి పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లారు. యువకుడి కాళ్లు, చేతులను తాడుతో కట్టేసి అతని ముందే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. ‘మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మా కోరిక తీర్చాలి, లేకుంటే నీ ఫొటోలు ఇంటర్నెట్లో పెడతాం’ అని బెదిరించారు. ఆ మరుసటి రోజే యువతికి ఫోన్‌చేసి తమ దగ్గరికి రావాలని బెదిరించారు. వరుసగా బెదిరింపులు రావడంతో ఆమె బుధవారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ పెద్దంబర్పేటకు చెందినవారిగా గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటిని ఎవరికైనా పంపారా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.