స్నేహాన్నిచాటే తొట్టాల్ విడాదు | Thriller time for Thottal Vidathu tamil cinema | Sakshi
Sakshi News home page

స్నేహాన్నిచాటే తొట్టాల్ విడాదు

Published Fri, Jun 27 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM

స్నేహాన్నిచాటే  తొట్టాల్ విడాదు

స్నేహాన్నిచాటే తొట్టాల్ విడాదు

 సృష్టిలో తీయనిది స్నేహం అంటారు. కొన్ని సమయంలో మిత్రబేధం కలిగినా అది శాశ్వతంగా ఉండదు. స్నేహం ఇతివృత్తంగా తెరపైకొచ్చిన పలు చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అలాంటి ఇతివృత్తంతో రూపొందుతున్న తాజా చిత్రం తొట్టాల్ విడాదు అంటున్నారు చిత్ర దర్శకుడు అజిత్ రవి పికాసస్. పికాసస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు అజిత్ రవి పికాసస్‌తోపాటు సనం శెట్టి, షాజియాన్, పరయిల్, విణు, అభిరగం, అనూఫ్, జార్జ్, బిపెన్‌జార్జ్, ప్రసాద్, నాన్సీ గుప్తా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ప్రేమకు మరణం లేనట్లుగానే స్నేహానికి అంతం ఉండదన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం తొట్టాల్ విడాదు అని తెలిపారు.
 
 ఒక యువకుడు దుబాయ్‌లోని తన స్నేహ బృందంతో కలసి వ్యాపారం చేయడానికి సొంత ఊరుకు వస్తారని చెప్పారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో అదనంగా వచ్చి చేరిన వ్యక్తి కారణంగా వారి జీవితాలు తలకిందులవుతాయన్నారు. ఆ సమస్యల నుంచి ఆ మిత్ర బృందం ఎలా బయటపడిందన్నదే చిత్ర కథ అని చెప్పారు. వినోద్ వేణు గోపాల్ సంగీతాన్ని, కృష్ణ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement