
ఆ ప్రార్థనలు ఫలించాయి!
ఈ మధ్య నా జీవితం అంతా సూట్‌కేసుల చుట్టూ తిరుగుతోంది. బట్టలు సర్దుకుని ఊరెళ్లడం, ఓ నాలుగు రోజుల్లో మళ్లీ రావడం. ఓ రోజు గ్యాప్‌లో ఇంకో ఊరెళ్లడానికి మళ్లీ సూట్‌కేస్ సర్దుకోవడం.. ఇలా ప్యాకింగ్.. అన్‌ప్యాకింగ్‌తో బిజీగా ఉంటున్నా’’ అన్నారు హన్సిక.
‘‘ఈ మధ్య నా జీవితం అంతా సూట్‌కేసుల చుట్టూ తిరుగుతోంది. బట్టలు సర్దుకుని ఊరెళ్లడం, ఓ నాలుగు రోజుల్లో మళ్లీ రావడం. ఓ రోజు గ్యాప్‌లో ఇంకో ఊరెళ్లడానికి మళ్లీ సూట్‌కేస్ సర్దుకోవడం.. ఇలా ప్యాకింగ్.. అన్‌ప్యాకింగ్‌తో బిజీగా ఉంటున్నా’’ అన్నారు హన్సిక. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి దాదాపు పది సినిమాల్లో నటిస్తున్నారామె. ఒకేసారి ఇన్నిన్ని ప్రయాణాలు చేయడం వల్ల అలసటగా లేదా? అని హన్సికను అడిగితే -‘‘అస్సలు లేదు. ఎందుకంటే, ఒకప్పుడు చేతిలో రెండు, మూడు సినిమాలు మాత్రమే ఉండేవి. కావల్సినంత ఖాళీ దొరికేది. అప్పుడు... ‘నాకే మాత్రం ఖాళీ దొరకనంతగా పని ఇవ్వు దేవుడా’ అని ప్రతిరోజూ ప్రార్థించేదాన్ని. ఆ ప్రార్థనలు ఫలించాయి.
ఈ బిజీని చాలా ఎంజాయ్ చేస్తున్నా. నా వయసు ఇప్పుడు 22. నేనేమో కెరీర్‌లో నిలదొక్కుకున్నాను. కానీ, నా స్నేహితులందరూ ఈ మధ్యే డిగ్రీ పూర్తి చేశారు. వాళ్లు సెటిల్ అవ్వడానికి మరో పదేళ్లు పడుతుందేమో’’ అని చెప్పారు. ఇటు తెలుగు, అటు తమిళంలో చాలామంది కథానాయికలున్నారు కదా? పోటీ సంగతేంటి? అనడిగితే - ‘‘నాకు నేనే పోటీ. సినిమా సినిమాకీ నటిగా ఎంత ఎదగాలా? అనే ఆలోచన తప్ప ఇతర విషయాల గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోను. ఎవరైనా బాగా యాక్ట్ చేస్తే మాత్రం ఫోన్ చేసి, అభినందిస్తుంటాను’’ అని చెప్పారు.