తమిళసినిమా: గతంలో అమ్మువాగియన్ నాన్, మాత్తియోసి వంటి సక్సెస్‌ఫుల్ త్రాలను నిర్మింన పీఎస్‌ఎస్‌ఆర్ ఫిలిమ్స్ అధినేత శేఖర్ సీతారామన్ తాజాగా కథానాయకుడిగా అవతారం ఎత్తారు. ఈయన హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఏ4. రవికుమార్ టీఎస్ కథ, కథనం, మాటలు సమకూర్చుతున్నారు. నటుడు ఇనిగో ప్రభాకర్, నటి ఐశ్వర్య దత్తలతోపాటు పలువురు ప్రముఖ నటినటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను రవికుమార్ తెలుపుతూ.. నిర్మాత శేఖర్ సీతారామన్‌ను కలిసి కథ వినిపించినప్పుడు ఆయనకు బాగా న్చిందన్నారు.
హీరోగా ఎవరిని ఎంపిక చేద్దామని అడిగారన్నారు. ఎలాంటి సంకోచం లేకుండా మీరే నటిస్తే బాగుంటుందని చెప్పానన్నారు.. ముందు ఆయన సంకోంచినా తన ఒత్తిడి మేరకు హీరోగా నటించారని తెలిపారు. ఏ 4 చిత్రం టైటిల్ మాదిరిగానే కథా, కథనాలు వైవిధ్యంగా ఉంటాయన్నారు. అందరికీ అర్థమయ్యే విధంగా చిత్రంలో సంభాషణలు ఉంటాయన్నారు. చిత్ర షటింగ్ చెన్నై, ఊటీ, కొడైకెనాల్ పరిసర ప్రాంతాల్లో చేస్తున్నట్లు చెప్పారు. శేఖర్ ఎంతో అనుభవం ఉన్న నటుడిగా నటిస్తున్నారని ప్రశంసించారు. దీనికి కేఏ రోయిన్ చాయగ్రహణను, సెంతమిళ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment