
శరవణా స్టోర్స్ అధి నేత శరవణన్ ‘ది లె జెండ్’ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. జేడీ, జెర్రీల ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సొంతంగా నిర్మించారు. తొలి చిత్రంతోనే కమర్షియల్ ఫార్ములా కథను ఎంపిక చేసుకుని మాస్ హీరోగా పరిచయమైన శరవణన్ ది లెజెండ్ చిత్రాన్ని భారీగా ఖర్చు చేసి నిర్మించారు. ఆయనకు సపోర్టుగా ప్రముఖ తారాగణాన్నే సెట్ చేసుకున్నారు. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకుని నటించి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.
అయినా ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో చిత్రం భారీ నష్టాన్ని మూటకట్టుకుందనే ప్రచారం జరిగింది. అయితే తొలి ప్రయత్నం విఫలమైనా చలించక శరవణన్ మరో ప్రయత్నానికి సిద్ధమయ్యారన్నది తాజా సమాచారం. యాక్షన్ హీరోగా నటించిన ఈయన ఈసారి లవర్‌బాయ్‌గా మారిపోతున్నారట. అందుకు తగ్గట్టుగా కథను సిద్ధం చేయాల్సిందిగా ఒక దర్శకుడికి చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనను దీపావళి సందర్భంగా వెల్లడించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment