అక్కడ కూడా ఇరగదీస్తున్నాడు..! | Jagapathi Babu look in Vijay 60th Movie | Sakshi
Sakshi News home page

అక్కడ కూడా ఇరగదీస్తున్నాడు..!

Published Sat, Jun 11 2016 12:10 PM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

అక్కడ కూడా ఇరగదీస్తున్నాడు..!

అక్కడ కూడా ఇరగదీస్తున్నాడు..!

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా వరుస సినిమాలు చేసి ప్రస్తుతం విలన్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతిబాబు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ సినిమాతో టాలీవుడ్లో విలన్గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న జగపతి బాబు ప్రజెంట్ సౌత్లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్గా ఉన్నాడు. ముఖ్యంగా భారీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలకు అదే స్ధాయి విలన్ కావాలంటే జగపతిబాబే బెస్ట్ ఛాయిస్ అని ఫీల్ అవుతున్నారు మేకర్స్.

ఇప్పటికే తెలుగులో మంచి క్యారెక్టర్స్తో ఆకట్టుకున్న జగపతి బాబు, ఇప్పుడు తమిళ నాట తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో జగపతిబాబు విలన్గా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబందించి జగ్గుబాయ్ లుక్ రిలీజ్ అయ్యింది. ఫుల్ మాస్ లుక్లో కనిపిస్తున్న జగపతి బాబుని చూస్తుంటే అక్కడ కూడా జెండా పాతేలాగే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది.

గతంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తాండవం సినిమాలో చిన్న పాత్ర చేసిన జగపతిబాబు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఆ తరువాత చేసిన లింగా కూడా నిరాశపరచటంతో కొద్ది రోజులు కోలీవుడ్కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి తమిళ నాట తన విలనిజాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు జగ్గుభాయ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement