'లెజెండ్' తొలిరోజు కలెక్షన్లు 7.4 కోట్లు
చెన్నై: నందమూరి బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రం భారీ కలెక్షన్లను వసూలు చేస్తోంది. 28 తేది శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. 35 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈచిత్రం సెలవుల కారణంగా వారాంతంలో మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో తొలి రోజున 7.4 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్ట్ త్రినాధ్ తెలిపారు. తొలిరోజు కంటే రెండవ రోజు (శనివారం) కలెక్షన్లు కొంత తగ్గాయని ఆయన తెలిపారు. వారాంతలోగా సుమారు 12 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు.
కమర్షియల్ హంగులతో పొలిటికల్ డ్రామాగా రూపొందిన 'లెజెండ్' చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ రూపొందించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సోనాల్ చౌహాన్, రాధికా ఆప్టే, కళ్యాణి తదితరులు నటించారు.