గయ్యాళి అత్త అనగానే అందరికీ సూర్యకాంతమే గుర్తొస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటివరకు ఆమె పేరు చెక్కుచెదరలేదు. అయితే తెరపై గయ్యాళిగా కనిపించినా ఆమె మనసు వెన్న. సూర్యకాంతానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆమె కుమారుడు, వైద్యుడు అనంత పద్మనాభ మూర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
గయ్యాలి కాదు
మా అమ్మ గయ్యాళి కాదు. అనురాగ దేవత. నా భార్యను సొంత కూతురిలా చూసుకునేది. పనిమనిషి ఉన్నప్పటికీ తనే వంట చేసి వడ్డించేది. అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. చదువుకునే సమయంలో చదువు, ఖాళీ సమయంలోనే ఆటలు అని చెప్పేది. నాన్న అడ్వకేట్. అమ్మకు ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. సావిత్రి అంటే అమ్మకు చాలా ఇష్టం. తనకు చాలా సహాయం చేసింది. అమ్మ చేతిలో దెబ్బలు తినని ఏకైక హీరోయిన్ జమునగారే! తనెప్పుడూ ఆమెకు కూతురిగానే నటించేది. గొప్ప నటీమణులందరూ ఆమె చేతిలో దెబ్బలు తిన్నవారే!
కిడ్నీ ఫెయిల్
అమ్మ చనిపోయిన ఏడాది పిచ్చిపట్టినట్లయింది. తను డయాబెటిక్. కిడ్నీ ఫెయిలవడం వల్లే చనిపోయింది. ఇంకా కొన్నాళ్లు బతికుండాల్సింది. అమ్మకు నెయ్యి ఇష్టం. అలాగే ఫ్రై చేసిన పదార్థాలు ఇష్టం. ఆహారం దగ్గర ఎటువంటి నియంత్రణ పాటించలేదు. డయాబెటిస్ రావడంతో డయాలసిస్ కూడా చేయించుకుంది. అప్పుడు గుండె సమస్య కూడా రావడంతో ఐసీయూలో చేర్చారు. దాదాపు పన్నెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది చివరకు పరమపదించింది.
మర్చిపోలేకపోయా..
తనను చివరిసారి చూసేందుకు వచ్చిన అప్పటి తమిళనాడు సీఎం జయలలిత.. అమ్మ పరిస్థితి నాకెందుకు చెప్పలేదు. ఇంకా మంచి వైద్యం ఇప్పించేదాన్ని కదా అంది. ఆ మాట చాలాకాలం మర్చిపోలేకపోయాను. అంత్యక్రియలకు ఎంతోమంది స్టార్స్ వచ్చారు. ఇప్పుడున్న మహిళలు ధైర్యంగా ఎలా మాట్లాడాలి? ఎలా పోరాడాలి? అన్న విషయాలను అమ్మ సినిమాల ద్వారా నేర్పించింది' అని పద్మనాభమూర్తి చెప్పుకొచ్చాడు.
చదవండి: త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి
Comments
Please login to add a commentAdd a comment