ఆ రికార్డ్ దక్కడం ఆనందంగా ఉంది! | Balayya's Legend Completes Glorious 175 Days | Sakshi
Sakshi News home page

ఆ రికార్డ్ దక్కడం ఆనందంగా ఉంది!

Published Wed, Sep 17 2014 11:10 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

ఆ రికార్డ్ దక్కడం ఆనందంగా ఉంది! - Sakshi

ఆ రికార్డ్ దక్కడం ఆనందంగా ఉంది!

 ‘‘ఈ మధ్యకాలంలో ఏ సినిమా అయినా వారాల లెక్కలో ఆడుతోంది కానీ, వంద రోజులు. నూటడెబ్బై అయిదు రోజులనేవి అరుదైపోయాయి. ఈ పరిస్థితిలో మా సినిమా 175 రోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. నందమూరి బాలకృష్ణ హీరోగా సాయి కొర్రపాటి అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన  ‘లెజెండ్’ చిత్రం నేటితో 175 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బోయపాటి శ్రీను మాట్లాడుతూ -‘‘ఇటీవలకాలంలో ఒకే హీరో, ఒకే దర్శకుడి కాంబినేషన్లో రూపొందిన రెండు సినిమాలు 175 రోజులు ఆడిన దాఖలాలు లేవు.
 
 ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలతో నాకూ, బాలయ్యబాబుకి ఆ రికార్డ్ దక్కడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. బాలకృష్ణ వందో సినిమాకి మీరే దర్శకుడటగా? అన్న ప్రశ్నకు - ‘‘మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్‌కి తగ్గ కథ కుదిరితే చేయొచ్చేమో. నాకెప్పుడు కథాంశం కుదిరితే అప్పుడు బాలయ్యను కలుస్తా’’ అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేస్తున్న చిత్రం గురించి మాట్లాడుతూ -‘‘శ్రీనివాస్ చేసిన తొలి సినిమా ‘అల్లుడు శీను’కి, దీనికీ చాలా వ్యత్యాసం ఉంటుంది. కొంచె బాడీ బిల్డప్ చేయమన్నాను. జుత్తు పెంచమన్నాను. శారీరక భాష మార్చుకోమన్నాను’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement