ఇంటర్నెట్ లో 'లెజెండ్' బైక్ మేకింగ్ హల్ చల్!
Published Mon, Nov 11 2013 2:14 PM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM
టాలీవుడ్ చరిత్రలో ఓ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ బైక్ ను డిజైన్ చేయించిన దాఖలాలేవి లేవు. తొలిసారిగా నందమూరి బాలకృష్ణ చిత్రం కోసం ఓ బైక్ ను డిజైన్ చేయించారు బోయపాటి శ్రీను. వర్దెంచి మోటార్ సైకిల్ ను సిల్లీ మాంక్స్ వారు తయారు చేశారు. ఈ బైక్ కు కెపాసిటీ 500 సీసీ, 41.3 ఎన్ఎమ్ టార్క్, 27.2 బీహెచ్ పీ సిట్టింగ్, 300 ఎంఎం వైడ్ రియర్ టైర్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
బాలకృష్ణ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బైక్ కు సినిమా పేరు 'లెజెండ్'ను పెట్టారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటిలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత బైక్ ను వేలానికి పెట్టనున్నట్టు చిత్రానికి సంబంధించిన వారు తెలిపారు. వరాహి చలన చిత్రం బ్యానర్ పై 14 రిల్స్ సంస్థ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తొలిసారిగా సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రాధికా ఆంప్టే నటిస్తోంది.
Advertisement
Advertisement