లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు, ఇంగ్లాండ్ 1966 ప్రపంచకప్ విజేత జాక్ చార్లటన్ (85) ఇకలేరు. మాజీ ఐర్లాండ్ మేనేజర్ జాక్ లింఫోమా కాన్సర్, డిమెన్షియాతో బాధపడు తున్నారు. జాక్ నిన్న శుక్రవారం) కన్నుమూశారని ఆయన కుటుంబం ప్రకటించింది. దీంతో ఫుట్‌బాల్ ప్రపంచం మూగబోయింది. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ ఫుట్ బాల్ క్లబ్‌లు, ఆటగాళ్లు ఆయన మృతికి నివాళులు అర్పించారు.
జాక్ మనవరాలు, జర్నలిస్ట్ ఎమ్మా విల్కిన్ సన్, లీడ్స్ యునైటెడ్‌తోపాటు, ఫుట్‌బాల్ ప్రేమికులు, అభిమానులు జాక్‌కు ట్విటర్ ద్వారా నివాళులర్పించారు. అద్భుతమైన డిఫెండర్‌గా రాణించిన జాక్ లీడ్స్ యునైటెడ్‌కు 21 సంవత్సరాల పాటు 773 ఆటలను ఆడారు. అనంతరం రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మేనేజర్‌గా దశాబ్దం పాటు సేవలందించారు. ఇటలీలో జరిగిన 1990 ప్రపంచ కప్ లో జట్టును క్వార్టర్ ఫైనల్స్‌కు తీసుకెళ్లిన ఘనత జాక్‌ది.
#LUFC are deeply saddened to learn club legend Jack Charlton passed away last night at the age of 85
— Leeds United (@LUFC) July 11, 2020
RIP Big Jack Charlton
— LEEDS UTD MEMORIES (@LUFCHistory) July 11, 2020
Another legend has left us
Absolutely gutted!#lufc pic.twitter.com/MpFhOlRdaK
RIP Jack Charlton. A true legend of the game. pic.twitter.com/mLBWPKYwR4
— 90s Football (@90sfootball) July 11, 2020
Comments
Please login to add a commentAdd a comment