ఎన్నికల్లో పోటీ చేయను: బాలకృష్ణ
కరీంనగర్: రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీకి సీమాంధ్ర, తెలంగాణలో ప్రచారం చేస్తాను అని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని ఆయన అన్నారు. అయితే పార్టీ ఆదేశిస్తే పోటీ చేసే అంశంపై పునరాలోచిస్తానని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని బాలకృష్ణ తెలిపారు.
కరీంనగర్ జిల్లా ధర్మపురిలో నరసింహస్వామిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల విడుదలైన లెజెండ్ సినిమా విజయం దిశగా పయనిస్తున్న సంగతి తెలిసిందే. లెజెండ్ చిత్రం విడుదలైన తర్వాత రాష్ట్రంలోని నరసింహ స్వామి ఆలయాలను దర్శించుకుంటున్నారు.