వాస్తు బాలేదే... అయ్యో వాస్తు బాలేదే....! | Fearing poll reverse, Balaiah takes recourse to Vastu correction | Sakshi
Sakshi News home page

వాస్తు బాలేదే... అయ్యో వాస్తు బాలేదే....!

Published Sat, May 3 2014 4:39 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

వాస్తు బాలేదే... అయ్యో వాస్తు బాలేదే....! - Sakshi

వాస్తు బాలేదే... అయ్యో వాస్తు బాలేదే....!

రీల్ లైఫ్ లో కంటిచూపుతో కాల్చేసే బాలయ్యకు రియల్ లైఫ్ లో ఓటమి భయం పట్టుకుంది. తెలుగుదేశం కంచుకోట లాంటి హిందూపూర్ లో ఓడిపోతానేమోనన్న భయంతో ఇప్పుడు ఓటరు మనసు మార్చడం తరువాత, అద్దె ఇంటి వాస్తును ముందు మార్చేద్దామని తాపత్రయ పడుతున్నారు. కనీసం వాస్తు మారినా ఓటరు మనసు మారుతుందేమోనని ఆశపడుతున్నారు. 
 
ఎన్నికల ప్రచారంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపోరు ఎక్కువ కావడంతో బాలయ్యకు తానుండే చోటికి వాస్తు దోషమున్నట్లు అనుమానాలు వచ్చాయి.హిందూపురం నియోజక వర్గంలో ఎదురుగాలి వీస్తున్నట్లు గమనించిన బాలయ్య ఇప్పుడు ఓటమి భయంతో ఓ గురూజీని కలిశారు.  హిందుపురం నుంచి అసెంబ్లీకి వెళ్లడానికి తన హిందూపూర్ కార్యాలయానికి ఉన్న వాస్తు దోషమే అడ్డు అని ఆ గురూజీ చెప్పడంతో ఇప్పుడు వాస్తును సరిచేసే పనిలో మునిగిపోయారు బాలయ్య. తెలుగు దేశం కార్యాలయం ద్వారాలు మార్పుచేశాడు. పార్టీ ఆఫీసుకే కాదు అద్దె ఇంటి వాస్తు దోషాలు కూడా సరిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement