Vaastu
-
ఏపీ సచివాలయంలో వాస్తుదోషం...!
అమరావతి: వాస్తు నెపంతో ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరోసారి మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. వాస్తు దోషం ఉందంటూ అధికారులు కొత్తగా మరో గేటు ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొత్త గేటు పెట్టేందుకు ప్రహారీ గోడ కూల్చివేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ కోసం మంత్రుల బ్లాక్‌ల వెనుక ఉన్న రహదారిని ఎమర్జెన్సీ రహదారిగా మార్చివేశారు. ఆ రహదారిలో ఎలాంటి వాహనాలు పెట్టరాదని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఉన్న నాలుగు గేట్లకు అదనంగా మరో గేటు పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తు ప్రకారం అయిదో గేటు ఉండాలనే సూచనతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే వాస్తు దోషం నేపథ్యంలో సచివాలయంలో పలుమార్లు మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రుల చాంబర్లతో పాటు వివిధ నిర్మాణాలకు సంబంధించి సుమారు ఏడెనిమిది సార్లు మార్పులు చేపట్టారు. వాస్తు పేరుతో వేలకోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చంద్రబాబుకు మళ్లీ వాస్తు భయం
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మళ్లీ వాస్తు భయం పీడిస్తోంది. దీంతో ఆయన ఏపీ సచివాలయంలో తన రూట్ మార్చారు. గేట్ నంబర్ 1 నుంచి కాకుండా గేట్ నంబర్ 2 నుంచి చంద్రబాబు సచివాలయంలోకి వెళుతున్నారు. అయితే వాస్తు కారణాలతోనే సీఎం రూట్ మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఓటుకు కోట్లు కేసుతో చిక్కుల్లో పడిన సమయంలోనూ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వాస్తుపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ఆయన తన రాకపోకల దారి మార్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఇప్పటివరకూ కుడివైపు తిరిగేవారు. ఇక నుంచి ఎడమ వైపునకు తిరిగి రాకపోకలు సాగించేవారు. అలాగే పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ను కూడా వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేసిన విషయం విదితమే. -
వాస్తు ఎఫెక్ట్: కేసీఆర్ కాన్వాయ్ రూట్ మార్పు
హైదరాబాద్: వాస్తు ఎఫెక్ట్ తో తెలంగాణ సీఎం కాన్వాయ్ రూట్ మార్పు ప్రణాళిక సిద్ధమైంది. సచివాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ రూట్ మార్పుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కార్యాలయం ఉన్న 'సీ' బ్లాక్‌కు వెళ్ళే దారికి వాస్తు దోషం ఉన్న కారణంగా మార్పులు చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. వాస్తు ప్రకారం కాన్వాయ్ రూటు మార్పు చేయాలని కేసీఆర్ సూచించారు. దాంతో సీఎం సూచనతో కాన్వాయ్ రూట్ మార్పు ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. కాన్వాయ్ రూట్ ను ఇంటెలిజెన్స్, పోలీసుశాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు. -
వాస్తు బాలేదే... అయ్యో వాస్తు బాలేదే....!
రీల్ లైఫ్ లో కంటిచూపుతో కాల్చేసే బాలయ్యకు రియల్ లైఫ్ లో ఓటమి భయం పట్టుకుంది. తెలుగుదేశం కంచుకోట లాంటి హిందూపూర్ లో ఓడిపోతానేమోనన్న భయంతో ఇప్పుడు ఓటరు మనసు మార్చడం తరువాత, అద్దె ఇంటి వాస్తును ముందు మార్చేద్దామని తాపత్రయ పడుతున్నారు. కనీసం వాస్తు మారినా ఓటరు మనసు మారుతుందేమోనని ఆశపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపోరు ఎక్కువ కావడంతో బాలయ్యకు తానుండే చోటికి వాస్తు దోషమున్నట్లు అనుమానాలు వచ్చాయి.హిందూపురం నియోజక వర్గంలో ఎదురుగాలి వీస్తున్నట్లు గమనించిన బాలయ్య ఇప్పుడు ఓటమి భయంతో ఓ గురూజీని కలిశారు. హిందుపురం నుంచి అసెంబ్లీకి వెళ్లడానికి తన హిందూపూర్ కార్యాలయానికి ఉన్న వాస్తు దోషమే అడ్డు అని ఆ గురూజీ చెప్పడంతో ఇప్పుడు వాస్తును సరిచేసే పనిలో మునిగిపోయారు బాలయ్య. తెలుగు దేశం కార్యాలయం ద్వారాలు మార్పుచేశాడు. పార్టీ ఆఫీసుకే కాదు అద్దె ఇంటి వాస్తు దోషాలు కూడా సరిచేస్తున్నారు. -
చెరువు పూడ్చేస్తా - ఎన్నికల్లో గెలుస్తా!
'ఏ గతీ లేకపోతే నీ గతి గంగావతే' అని ఒక సామెత ఉంది. ఎన్నికల్లో పదేపదే ఓడిపోతూంటే ఏ నాయకుడైనా ఏం చేస్తాడు? ఫార్ములాలన్నీ పటాపంచలైపోతూంటే, లెక్కలన్నీ ముక్కలైపోతూంటే ఎంతటి వాడైనా వాస్తు, జ్యోతిష్యాన్ని ఆశ్రయించాల్సిందే. అలాంటి గతే పట్టింది మన లాలూ ప్రసాద్ యాదవ్ కి. ఒకప్పుడు బీహార్ ను ఏకఛ్చత్రంగా ఏలిన లాలూ ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. పన్నెండు మంది ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ మంత్రులు పార్టీకి రాం రాం చెప్పారు. కాంగ్రెస్ తో ఎన్నికల ఒప్పందం ఇంకా ఖాయం కాలేదు. రకరకాల కేసులు మరోవైపు చీకాకు పెడుతున్నాయి. వీటన్నిటినీ తట్టుకునేందుకు లాలూ ఏం చేస్తున్నారు? ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా తన ఇంట్లో ఉన్న ఓ చెరువును కప్పిపెట్టించేస్తున్నారు లాలూ. 2006 లో పాట్నా యాన్ మార్గ్ అధికార భవనం నుంచి లాలూ దంపతులు సర్కులర్ రోడ్ లో ఉన్న భవనానికి వచ్చారు. అప్పుడు ఛత్ పూజ కోసం ఆయన నివాసభవనంలోనే ఒక భారీ చెరువు తవ్వించారు. అప్పట్నుంచే ఆయనకు సమస్యలు మొదలయ్యాయట. దాంతో ఇప్పుడు ఆ చెరువును పూడ్చేసే పని మొదలుపెట్టారాయన. 1990 లో తొలిసారి అధికారానికి వచ్చినప్పుడు లాలూ వ్యవహార శైలి చాలా విప్లవాత్మకంగా ఉండేది. బాబాలు, తాయెత్తులంటే చాలు భగ్గుమనేవారు. పూజలు పునస్కారాలంటే మండిపడేవారు. ఇప్పుడు మాత్రం ఆయన బాబా పేరు చెబితే చాలు వెళ్లి పాదాలమీద పడిపోతున్నారు. లాలూ ఈ మధ్యే ఉత్తరప్రదేశ్ మీర్జాపుర్ లోని పగ్లా బాబా (పిచ్చి బాబా) ను సందర్శించి, సాగిలపడి వచ్చారు. అంతే కాదు... ప్రస్తుతం ఆయన ఇంట్లో టికెట్లు అడిగేవారికన్నా జాతకాలు చూసి, తంత్ర యంత్ర మంత్రాలు చేసే జ్యోతిష్కులు, తావీజు బాబాల సంఖ్యే ఎక్కువగా ఉందంటున్నారు. వాళ్లేం చెబితే అది చేస్తున్నారట లాలూ ప్రసాద్, రబ్రీ దేవి దంపతులు. -
'వాస్తు మారుస్తాం...అధికారం సాధిస్తాం'