వాస్తు ఎఫెక్ట్: కేసీఆర్ కాన్వాయ్ రూట్ మార్పు
హైదరాబాద్: వాస్తు ఎఫెక్ట్ తో తెలంగాణ సీఎం కాన్వాయ్ రూట్ మార్పు ప్రణాళిక సిద్ధమైంది. సచివాలయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ రూట్ మార్పుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కార్యాలయం ఉన్న 'సీ' బ్లాక్‌కు వెళ్ళే దారికి వాస్తు దోషం ఉన్న కారణంగా మార్పులు చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు.
వాస్తు ప్రకారం కాన్వాయ్ రూటు మార్పు చేయాలని కేసీఆర్ సూచించారు. దాంతో సీఎం సూచనతో కాన్వాయ్ రూట్ మార్పు ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేశారు. కాన్వాయ్ రూట్ ను ఇంటెలిజెన్స్, పోలీసుశాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు.