బాలయ్యకు చేదు అనుభవం | Bitterness experience of balakrishna | Sakshi
Sakshi News home page

బాలయ్యకు చేదు అనుభవం

Published Mon, May 5 2014 2:26 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలయ్యకు చేదు అనుభవం - Sakshi

బాలయ్యకు చేదు అనుభవం

 ప్రచారం సందర్భంగా గోబ్యాక్ అంటూ నినాదాలు

 హిందూపురం,  అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణకు ప్రజలు షాక్ ఇచ్చారు. ఆదివారం హిందూపురం మండలం చెలివెందులలో శ్రీగవి రంగనాథస్వామి రథోత్సవం నిర్వహించారు. బాలకృష్ణ.. మాజీ ఎమ్మెల్యేలు రంగనాయకులుతో కలిసి అక్కడికి వెళ్లారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం విక్టరీ సింబల్ చూపుతూ బయటికి వచ్చారు. నిబంధనల మేరకు దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, ధార్మిక సంస్థల్లో ప్రచారం చేయరాదు. వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా రథోత్సవం జరుగుతున్న సమయంలో భక్తులకు విక్టరీ సింబల్ చూపిస్తూ బాలయ్య తన ప్రసంగం ప్రారంభించారు. రథం లాగుతున్న గ్రామస్తులు చేతులు పెకైత్తి చూపుడు వేలును గిరగిరా తిప్పుతూ ‘ఫ్యాన్’ గాలి వీస్తోందని సైగ చేశారు. గ్రామస్తులు ‘గో బ్యాక్ ’ అంటూ నినాదాలు చేశారు. దాంతో బాలయ్య వెనుదిరిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement