'బాలకృష్ణకు హిందూపురం టికెట్ ఇవ్వొద్దు' | Fight for Hindupuram ticket in TDP | Sakshi
Sakshi News home page

'బాలకృష్ణకు హిందూపురం టికెట్ ఇవ్వొద్దు'

Published Fri, Apr 4 2014 9:35 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

'బాలకృష్ణకు హిందూపురం టికెట్ ఇవ్వొద్దు' - Sakshi

'బాలకృష్ణకు హిందూపురం టికెట్ ఇవ్వొద్దు'

'బాలకృష్ణకు హిందూపురం టికెట్ ఇవ్వొద్దు'

అనంతపురం : పొలిటికల్ ఎంట్రీకి తహతహలాడుతున్న సినీనటుడు బాలకృష్ణకు స్థానిక సెగ తగులుతోంది. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడ నుంచి అయినా పోటీ చేస్తానన్న ఆయనకు హిందుపురంలో చుక్కెదురు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బాలకృష్ణకు కాకుండా బాలకృష్ణకు కాకుండా స్థానికులకే టీడీపీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. దాంతో  మైనార్టీలకు టీడీపీ అన్యాయం చేస్తుందని హిందూపురంలో కరపత్రాల పంపిణీ స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

బాలకృష్ణకు హిందూపురం అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దని ఆ కరపత్రాల్లో వుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీకి టికెట్ ఇవ్వకుండా మైనార్టీలకు పార్టీ అన్యాయం చేస్తోందంటూ   మరో వైపు సిటింగ్ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీకి టికెట్ ఇవ్వకుండా మైనార్టీలకు పార్టీ అన్యాయం చేస్తోందంటూ ఆ వర్గం నేతలు భారీ ఎత్తున కరపత్రాలు పంపిణీ చేశారు.

అయితే అబ్దుల్ ఘనీనే ఈ కరపత్రాలను పంపిణీ చేయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా నేడు లెజెండ్ విజయోత్సవ యాత్రలో భాగంగా బాలకృష్ణ శుక్రవారం అనంతపురం, హిందూపురంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కరపత్రాల పంపిణీ స్రాధాన్యత సంతరించుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement