ముంబైకు చెందిన వేదాంత్ పనేసర్ చదరంగంలో ప్రతిష్టాత్మకమైన ఫిడే మాస్టర్ (ఎఫ్‌ఎం) టైటిల్‌ను గెలుచుకున్నాడు. ముంబయిలోని విలేపార్లేలోని ఎన్‌ఎం కాలేజీ విద్యార్ధి అయిన వేదాంత్, ఇప్పటికే 17 జాతీయ చెస్ చాంఫియన్‌షిప్‌లతో పాటుగా కామన్‌వెల్త్ కాంస్య పతకమూ గెలుచుకున్నాడు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెక్స్ (ఫిడే) ఈ ప్రతిష్టాత్మకమైన ఫిడే మాస్టర్ (ఎఫ్‌ఎం) టైటిల్‌ను ప్రకటించింది. గ్రాండ్ మాస్టర్ (జీఎం) మరియు ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) టైటిల్స్ తరువాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఇది. ఈ గుర్తింపు పొందడానికి స్థిరమైన ఆటతీరు ప్రదర్శిస్తూ, అంతర్జాతీయ పోటీలలో 2300 లేదా అంతకు మించిన ఫిడే రేటింగ్ పొందాల్సి ఉంటుంది.
చెస్ చాంఫియన్‌గా వేదాంత్ 2380 ఫిడే రేటింగ్ పొందాడు. ఈ రేటింగ్ పొందడానికి ఎన్‌ఎం కాలేజీ కార్యాచరణ ఎంతగానో తోడ్పడింది. వేదాంత్ లాంటి ప్రతిభావంతులను గుర్తించి, తగిన శిక్షణ అందించడంలో ఎన్‌ఎం కాలేజీ అత్యంత కీలక పాత్రపోషించింది. చిన్నప్పటి నుంచీ చెస్ అంటే ఇష్టంతో కలిగిన వేదాంత్ తాను గెలవడంతో పాటు ఇతరులకు సైతం ఈ గేమ్ నైపుణ్యాలను అందించేందుకు ముందుంటాడు. లాక్‌డౌన్ సమయంలో తను స్వయంగా ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించడంతో పాటుగా ప్రతిభావంతులకు తగిన ప్రోత్సాహమూ అందించాడు అలా వచ్చిన ఆదాయాన్ని సైతం పిఎం కేర్ ఫండ్స్‌కు అందించాడు. ఫిడే మాస్టర్ టైటిల్ పొందిన వేదాంత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మాస్టర్(ఐఎం) టైటిల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.
చదవండి: SA Vs IND: కోహ్లి.. ఎలా ఆడాలో రాహుల్‌ని చూసి నేర్చుకో: భారత మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment