
మేయర్స్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ శుభారంభం చేశాడు. ముంబైలో సోమవారం మొదలైన ఈ టోర్నీ తొలి రోజు ఆడిన మూడు గేముల్లోనూ అతను విజయం సాధించాడు. రెండో రౌండ్‌లో (ఎఫ్‌ఎం) ఫిడే మాస్టర్ హోదా ఉన్న అర్జున్ ఏకంగా విదేశీ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)కే చెక్ పెట్టాడు.
అమెరికాకు చెందిన రసెట్ జియటెడినోవ్‌ను అర్జున్ 43 ఎత్తుల్లో ఓడించాడు. అంతకుముందు తొలి రౌండ్‌లో అర్జున్ 34 ఎత్తుల్లో శాంతారామ్ (భారత్)పై, మూడో రౌండ్‌లో 49 ఎత్తుల్లో సంజీవ్ నాయర్ (భారత్)పై నెగ్గాడు.