
ఆల్టిబాక్స్ నార్వే ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో వరుసగా ఆరు ‘డ్రా’లు నమోదు చేసిన తర్వాత... భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఖాతాలో తొలి విజయం చేరింది. నార్వేలోని స్టావెంజర్ నగరంలో జరుగుతోన్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన ఏడో రౌండ్‌లో ఆనంద్ 40 ఎత్తుల్లో మాక్సిమి వాచియెర్ లాగ్రేవ్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. బుధవారం జరిగే ఎనిమిదో రౌండ్‌లో ఫాబియానో కరువానా (అమెరికా)తో ఆనంద్ తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment