తెలుగు చతురంగ బలం | Special Story On Child Chess Prodigy Alana Meenakshi To Receive Bal Puraskar Ap | Sakshi
Sakshi News home page

తెలుగు చతురంగ బలం

Published Wed, Feb 8 2023 1:36 AM | Last Updated on Wed, Feb 8 2023 1:40 AM

Special Story On Child Chess Prodigy Alana Meenakshi To Receive Bal Puraskar Ap - Sakshi

రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం. ప్రధానితో ముచ్చటగా మాటామంతీ.ఇలాంటి ఓ రోజును కలలోనైనా కలగనలేదు.బాలపురస్కార్‌ గ్రహీత అంతరంగం ఇది.

నాలుగేళ్ళ చిరుప్రాయంలో చదరంగ ΄పావులు కదపడం నేర్చిన ఆ చిన్నారి... పదకొండవ ఏటనే ఉమెన్‌ ఫిడే మాస్టర్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా గణతంత్రదినోత్సవ వేడుకల్లో భాగంగా బాలపురస్కార్‌ అవార్డును అందుకుంది. ఆ చిన్నారే ఆంధ్రప్రదేశ్‌ విశాఖకు చెందిన కొలగట్ల అలన మీనాక్షి. అమ్మ ఆడుకునేందుకు సరదాగా ఇచ్చిన చతురంగ బోర్డే ఆనతికాలంలో ఎత్తులకు పైఎత్తులు వేసి ఫిడే మాస్టర్‌ టైటిల్‌ సాధించే స్థాయికి ఎదిగిన క్రమాన్ని ఆమె ‘సాక్షి’తో పంచుకుంది. 

 ప్రశ్న: చదరంగం ఆడటం ఎలా ప్రారంభమైంది? 
జవాబు: నాలుగేళ్లప్పుడు ఆమ్మ (అపర్ణ) సరదాగా ఆడుకోవడానికి బోర్డ్‌గేమ్స్‌తో ΄పాటు చదరంగం బోర్డ్‌ ఇచి్చంది. అది మాగ్నటిక్‌ బోర్డ్‌. చాలా సరదాగా వుండేది. ఆ తర్వాత గడుల్లో పావులు పెట్టి ఆనందపడేదాన్ని. అది గమనించిన అమ్మ శిక్షణకు తీసుకువెళ్ళింది. అలా వేసవి శిబిరంలో శిక్షణ΄÷ంది తొలిసారి స్థానిక టోరీ్నలో ΄ాల్గొంటే యంగెస్ట్‌ ప్లేయర్‌గా నిలిచాను. అప్పటినుంచి మరో ఏడాది ఆటపై దృష్టిపెట్టి ఐదున్నరేళ్లకే జిల్లా చాంపియన్‌గా నిలిచాను. 

∙ఫిడే మాస్టర్‌గా ఎలా ఎదిగారు? 
బాలికల అండర్‌ 7 లో ఐదున్నరేళ్ళకే టోరీ్నల్లో ΄ాల్గొనడంతో ఫిడే రేటింగ్‌ మొదలైంది. క్రమంగా 2021లో ఎలో రేటింగ్‌ 1829కి చేరడంతో ఉమెన్‌ కాండిడేట్‌ మాస్టర్‌ టైటిల్‌ సాధించాను. ఇక అక్కడి నుంచి సీరియస్‌గానే టోరీ్నల్లో ΄ాల్గొనడం, రేటింగ్‌ పెంచుకోవడంతో గత డిసెంబర్‌లో ఉమెన్‌ ఫిడే మాస్టర్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాను. స్పెయిన్‌లో ప్రపంచ చదరంగం క్యాంప్‌లో ఉండగా ఉమెన్‌ ఫిడే మాస్టర్‌ టైటిల్‌కు అర్హమైన ఎలోరేటింగ్‌ 2100 ΄ాయింట్లు సాధించాను. 

బాల పురస్కార్‌ అవార్డు వస్తుందని ఊహించారా? 
జనవరి 20వ తేదీ సాయంకాలం నాన్న(మధు)కి ఓ కాల్‌ వచి్చంది. ఆ కాల్‌ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ మినిస్ట్రీ నుంచి. అర్జంట్‌గా వివరాలను పం΄ాలని అన్నారు. బాల పురస్కార్‌ అవార్డుకి ఎంపికయ్యానన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఐదారు నిమిషాలు పట్టింది. అంతే! గంటలో టికెట్స్‌ రావడం... మరుసటి రోజే ఢిల్లీకి పయనమవడం అంతా జరిగి΄ోయింది. అయితే రాష్ట్ర సంప్రదాయ దుస్తుల్లో రావాలన్నారు. 

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎలా ఉంది? 
అంత పెద్ద అవార్డు అందుకోవడం.. అదీ దేశ ప్రథమ΄పౌరురాలి చేతుల మీదుగా చిరు్ర΄ాయంలోనే తీసుకోవడం చాలా గర్వకారణం. రాష్ట్రానికి ప్రతినిధి కావడం ఒక మధురానుభూతి. 

ప్రధానమంత్రితో మాట్లాడారా? 
మోదీ గారు బాల పురస్కార గ్రహీతలందర్నీ కూర్చోబెట్టుకుని ముచ్చటించారు. నాతో ఆయన తెలుగులో మాట్లాడారు. ‘నేను చెప్పడం కాదు మీరు చెప్పండి’ అన్నారు. మాస్టర్‌ టైటిల్స్‌ సాధించడం వరకు నా అనుభవాన్ని చె΄్పాను. నాకు కొందరికి శిక్షణ ఇవ్వాలని ఉంది అంటే... ‘నీకు ఇంకా చాలా కెరీర్‌ ఉంది. మరిన్ని విజయాలను సొంతం చేసుకుని దేశానికి ఖ్యాతి తేవాలి’ అన్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నారు? 
‘ఇంత చిన్నవయస్సులోనే ఇన్ని టైటిల్స్‌ సొంతం చేసుకున్నావా’ అని ఆశ్చర్యపోయారు. ‘రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచా’వని జగన్‌ సర్‌ అభినందించారు. 

మీ తదుపరి లక్ష్యం ఏమిటి? 
ప్రస్తుతం నేను ఆరోతరగతి చదువుతున్నాను. మార్చిలో పరీక్షలున్నాయి. పాఠశాలలోనూ చక్కటి ప్రోత్సాహం లభిస్తోంది. పరీక్షలనంతరం జూన్‌లో యూరప్‌ వెళదామని అనుకుంటున్నాను. రేటింగ్‌ను మెరుగుపరుచుకుని ఐఎం నార్మ్‌ సాధించడానికి ఎక్కువ టోర్నీలు ఆడవలసి ఉంటుంది. కొంతకాలం అక్కడుంటేనే అది సాధ్యం. నా తదుపరి లక్ష్యం ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (డబ్లు్య ఐఎం)...  అంటూ నవ్వుతూ ఇంటర్వ్యూ ముగించింది అలన మీనాక్షి. ఈ చిన్నారికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా. 
– డాక్టర్‌ సూర్యప్రకాష్‌ మాడిమి, సాక్షి, విశాఖపట్నం 

ఎత్తులకు పై ఎత్తులు 
► 2021 డిసెంబర్‌ 1న ఫిడే అండర్‌ 10 బాలికల చదరంగంలో ఉమెన్‌ కాండిడెట్‌ మాస్టర్‌ (డబ్లు్యసిఎం)గా ప్రకటించారు. 
►అండర్‌10 బాలికల కేటగిరీలో 1829 ఎలో రేటింగ్‌తో ప్రపంచం రెండో రాంక్‌కు చేరింది. అదే ఏడాది సెర్బియాలో జరిగిన ఉమెన్‌ లీగ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లోనూ జట్టు నాలుగోస్థానంలో నిలవడంలో చక్కటి ప్రతిభ. 
► 2021లో నేషనల్‌ అండర్‌ 10 బాలికల చదరంగం చాంపియన్‌íÙప్‌. 
►ఏషియన్‌ స్కూల్స్‌ అండర్‌ 7 క్లాసిక్‌లో స్వర్ణాన్ని సాధించగా... ర్యాపిడ్‌లో స్వర్ణాన్ని టైగా నిలిచింది. 
► కామన్‌వెల్త్‌ అండర్‌ 8 బాలికల్లో ఆరోస్థానం. 
► ప్రపంచ పాఠశాలల అండర్‌7 బాలికల క్లాసిక్‌ పోటీల్లో 13వ స్థానం.  
►  ఏషియన్‌ యూత్‌ – 8 బాలికల రాపిడ్‌ చెస్‌లో స్వర్ణాన్ని సాధించింది. వెస్ట్రన్‌ అసియన్‌ –8 బాలకల రాపిడ్, బ్లిజ్‌లలో స్వర్ణాలు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement