![Tepe Sigeman And Co 2023 R4: Arjun Erigaisi Lost To Jordan van Fortis - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/9/arjun.jpg.webp?itok=TOGNUpf0)
టెపి సెగెమన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో పరాజయం చవిచూశాడు. స్వీడన్‌లో సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో అర్జున్ 51 ఎత్తుల్లో జోర్డాన్ వాన్ ఫోరీస్ట్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు.
భారత సంతతికి చెందిన అమెరికా గ్రాండ్‌మాస్టర్ అభిమన్యు మిశ్రా, భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ మధ్య జరిగిన గేమ్ 42 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఐదో రౌండ్ తర్వాత గుకేశ్ మూడు పాయింట్లతో మూడో స్థానంలో, అర్జున్ రెండు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment