సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్‌ఫీల్డ్ కప్ క్లాసికల్ చెస్ టోర్నమెంట్‌ను భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ‘డ్రా’తో ప్రారంభించాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో జరిగిన తొలి రౌండ్ గేమ్‌ను గుకేశ్ 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. డింగ్ లిరెన్, గుకేశ్ మధ్య ఈ ఏడాది నవంబర్‌లో సింగపూర్ వేదికగా ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు తలపడటం ఆసక్తిని కలిగించింది.
భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద కూడా తన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. నొదిర్‌బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో జరిగిన గేమ్‌ను ప్రజ్ఞానంద 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. మొత్తం పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్లు ఫాబియానో కరువానా (అమెరికా), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్), వెస్లీ సో (అమెరికా), అనీశ్ గిరి (నెదర్లాండ్స్), డింగ్ లిరెన్ (చైనా), ఇయాన్ నెపోమ్‌నిషి (రష్యా), మాక్సిమి వాచెర్ లెగ్రావ్ (ఫ్రాన్స్), నొదిర్‌బెక్ మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment