సింగపూర్ సిటీ: వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. 14వ గేమ్‌లో గుకేశ్ ప్రస్తుత ఛాంపియన్, చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించాడు. గుకేశ్ 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
THE EMOTIONS...!!! 🥹❤️
- 18 Year Old Gukesh Dommaraju creating history by becoming the youngest ever champion. 🇮🇳 pic.twitter.com/LVkA8JMKM1— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024
విశ్వనాథన్ ఆనంద్ తర్వాత (2012) వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు. గుకేశ్ అత్యంత చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీ పడిన అతి పిన్న వయస్కుడిగానూ గుకేశ్ రికార్డు నెలకొల్పాడు. గుకేశ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా.
THE PRECIOUS MOMENT. 🥹
- Gukesh hugging his father aftee creating history. ❤️pic.twitter.com/iLs5aNFIEW— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2024
Comments
Please login to add a commentAdd a comment