Chess Olympiad 2022: చెన్నై వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్ల హవా కొనసాగుతుంది. స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు పరాజయం అన్నది లేకుండా దూసుకెళ్తున్నారు. ఓపెన్, మహిళల విభాగాల్లో భారత జట్లు వరుసగా మూడో విజయాలు సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాయి.
ఆదివారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో (ఓపెన్ విభాగంలో) తెలుగు యువ కెరటాలు హరికృష్ణ, అర్జున్ ఇరిగైసి సత్తచాటడంతో భారత్ ‘ఎ’ 3–1తో గ్రీస్‌పై విజయం సాధించింది. దిమిత్రోస్‌పై హరికృష్ణ విజయం సాధించగా, అర్జున్.. మాస్తోవసిల్స్‌ను చిత్తు చేశాడు.
భారత ‘బి’.. స్విట్జర్లాండ్‌పై (4–0) ఏకపక్ష విజయం నమోదు చేయగా.. భారత్ ‘సి’ 3–1తో ఐస్‌లాండ్‌పై నెగ్గింది. మహిళల విషయానికొస్తే.. భారత్ ‘ఎ’ 3–1తో ఇంగ్లండ్‌పై.. భారత్ ‘బి’ 3–1తో ఇండోనేసియాపై.. భారత్ ‘సి’ 2.5–1.5తో ఆస్ట్రియాపై గెలుపొందాయి.
Comments
Please login to add a commentAdd a comment