
ప్రాగ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రెండో విజయం నమోదు చేశాడు. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతితో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ప్రజ్ఞానంద 52 ఎత్తుల్లో గెలిచాడు. డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన గేమ్‌లో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ 61 ఎత్తుల్లో ఓడిపోయాడు. ఐదో రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద, గుకేశ్ 2.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో ర్యాంక్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment