ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ ఓపెన్ బ్లిట్జ్ టైటిల్‌ను అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా) గెలుచుకున్నాడు. కోల్‌కతాలో శనివారం ముగిసిన ఈ టోర్నీలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెండు సార్లు వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ అయిన గ్రిషుక్ ఈ టోర్నీ లోనూ సత్తా చాటాడు. మొత్తం టోర్నీ లో అతను ఒకే ఒక రౌండ్‌లో ఓడాడు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అబ్దుస్సతరోవ్ రెండో స్థానం (11 పాయింట్లు) సాధించగా...భారత టీనేజ్ సంచలనం ఆర్.ప్రజ్ఞానంద (11)కు మూడో స్థానం దక్కింది.
ఇతర భారత ఆటగాళ్లలో అర్జున్ ఇరిగేశి (4వ), పెంటేల హరికృష్ణ (6వ), విదిత్ గుజరాతీ (7వ), డి.గుకేశ్ (8వ) టాప్–10లో ముగించారు. నాలుగు రౌండ్‌లలో వరుసగా ఓటమి లేకుండా నిలిచినా...ఆ తర్వాత అబ్దుస్సతరోవ్, గ్రిషుక్, విదిత్ చేతుల్లో పరాజయం పాలు కావడంతో ప్రజ్ఞానంద వెనుకబడిపోయాడు. భారత నంబర్‌వన్ గుకేశ్ చివరి రోజు 9 రౌండ్లలో ఆరింటిలో ఓటమిపాలయ్యాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఇటీవల జరిగిన ప్రపంచ కప్ చెస్ టోర్నీ ఫైనల్లో కార్ల్‌సన్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment