third position
-
అర్జున్‌కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: షెన్జెన్ లాంగాంగ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. చైనా వేదికగా ఎనిమిది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య నిర్ణీత ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో జియాంగ్జి బు (చైనా), యాంగీ యు (చైనా), అర్జున్ 4.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... జియాంగ్జి టైటిల్ గెల్చుకోగా... యాంగీ యు రన్నరప్‌గా నిలిచాడు. అర్జున్‌కు మూడో స్థానం ఖరారైంది. ఏడు గేమ్‌లు ఆడిన అర్జున్ మూడు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయాడు. -
ప్రజ్ఞానందకు మూడో స్థానం
ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ ఓపెన్ బ్లిట్జ్ టైటిల్‌ను అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా) గెలుచుకున్నాడు. కోల్‌కతాలో శనివారం ముగిసిన ఈ టోర్నీలో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెండు సార్లు వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్ అయిన గ్రిషుక్ ఈ టోర్నీ లోనూ సత్తా చాటాడు. మొత్తం టోర్నీ లో అతను ఒకే ఒక రౌండ్లో ఓడాడు. ఉజ్బెకిస్తాన్‌కు చెందిన అబ్దుస్సతరోవ్ రెండో స్థానం (11 పాయింట్లు) సాధించగా...భారత టీనేజ్ సంచలనం ఆర్.ప్రజ్ఞానంద (11)కు మూడో స్థానం దక్కింది. ఇతర భారత ఆటగాళ్లలో అర్జున్ ఇరిగేశి (4వ), పెంటేల హరికృష్ణ (6వ), విదిత్ గుజరాతీ (7వ), డి.గుకేశ్ (8వ) టాప్–10లో ముగించారు. నాలుగు రౌండ్లలో వరుసగా ఓటమి లేకుండా నిలిచినా...ఆ తర్వాత అబ్దుస్సతరోవ్, గ్రిషుక్, విదిత్ చేతుల్లో పరాజయం పాలు కావడంతో ప్రజ్ఞానంద వెనుకబడిపోయాడు. భారత నంబర్‌వన్ గుకేశ్ చివరి రోజు 9 రౌండ్లలో ఆరింటిలో ఓటమిపాలయ్యాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానంద ఇటీవల జరిగిన ప్రపంచ కప్ చెస్ టోర్నీ ఫైనల్లో కార్ల్సన్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. -
ప్రజ్ఞానందకు మూడో స్థానం
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ ర్యాపిడ్ ఓపెన్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రజ్ఞానంద, అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా), విదిత్ సంతోష్ గుజరాతి (భారత్) ఐదు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. ప్రజ్ఞానందకు మూడో ర్యాంక్, గ్రిషుక్‌కు నాలుగో ర్యాంక్, విదిత్‌కు ఐదో ర్యాంక్ లభించాయి. గురువారం జరిగిన చివరి మూడు రౌండ్లలో 18 ఏళ్ల ప్రజ్ఞానంద సహచరులు విదిత్, ఇరిగేశి అర్జున్లపై గెలిచి భారత నంబర్‌వన్ దొమ్మరాజు గుకేశ్ చేతిలో ఓడిపోయాడు. 4.5 పాయింట్లతో గుకేశ్ ఆరో స్థానంలో నిలిచాడు. 3 పాయింట్లతో అర్జున్ తొమ్మిదో స్థానంలో, పెంటేల హరికృష్ణ 2.5 పాయింట్లతో చివరిదైన పదో స్థానంలో నిలిచారు. 7 పాయింట్లతో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమి వచీర్ లాగ్రెవ్ చాంపియన్‌గా అవతరించగా... 5.5 పాయింట్లతో తైమూర్ రజబోవ్ (అజర్బైజాన్) రన్నరప్‌గా నిలిచాడు. నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
టమాటా ఉత్పత్తిలో రాష్ట్రానికి మూడో స్థానం
సాక్షి, అమరావతి: దేశంలో టమాటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2022–23లో 23.37 లక్షల మెట్రిక్ టన్నుల టమాటాలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో దేశం మొత్తం టమాటా ఉత్పత్తిలో రాష్ట్రం వాటా 11.30 శాతంగా నమోదైంది. ఈ మేరకు ఇటీవల టమాటా ధరల పెరుగుదలకు కారణాలు, సమస్యలపై నాబార్డు మంగళవారం నివేదికను విడుదల చేసింది. ప్రధానంగా దేశంలో టమాటాలు ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో 2022–23లో ఉత్పత్తి భారీగా తగ్గిందని నివేదిక తెలిపింది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోలి్చతే 2022–23లో 1.50 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడమే కారణం.. ప్రధానంగా టమాల ధరల పెరుగుదలకు గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గడమేనని నాబార్డు తెలిపింది. దీంతో పాటు మేలో అకాల వర్షాలు, జూన్‌లో వర్షాలు, వడగండ్ల వానలకు పంట దెబ్బతిందని వివరించింది. కర్ణాటకలో పంట ప్రధాన ప్రాంతాల్లో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వడగళ్ల వానలకు, జూన్‌లో భారీ వర్షాలకు.. వేసిన పంటలో 70 శాతం నాశనమైందని పేర్కొంది. అలాగే మహారాష్ట్రలో ఈ ఏడాది వాతావరణ అననుకూల పరిస్థితులు ఉండటంతో పెద్ద ఎత్తున పంట దెబ్బతిందని వెల్లడించింది. దేశంలో టమాటా ఉత్పత్తి 2021–22లో 206.9 లక్షల టన్నులు ఉండగా ఇది 2022–23లో 206.2 లక్షల టన్నులకు తగ్గిందని తెలిపింది. దీంతో ఈ ఏడాది జూలైలో దేశంలో టమాటా ధరలు మూడు రెట్లు పెరిగాయని వివరించింది. ఈ ఏడాది జూన్‌లో కిలో టమాటా దాదాపు రూ.30 ఉండగా జూలై చివరి నాటికి రిటైల్ మార్కెట్లో కిలో రూ.130కి పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు 10న హోల్‌సేల్‌లో కిలో రూ.106.91 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.131.69 ఉందని వెల్లడించింది. -
పర్యాటకుల ఆకర్షణలో జోష్
దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న టాప్ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 2022 సంవత్సరానికి సంబంధించి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా.. రెండో స్థానంలో తమిళనాడు ఉంది. అలాగే, కర్ణాటక నాలుగో స్థానంలో.. గుజరాత్ ఐదో స్థానంలో ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం వరుసగా 2021, 2022లో మూడో స్థానంలో ఉంది. అయితే, 2021 సంవత్సరంతో పోలిస్తే 2022లో ఏపీలో భారీ వృద్ధి నమోదైనట్లు ఆ గణాంకాలు పేర్కొన్నాయి. 2021లో ఆంధ్రప్రదేశ్ 9.32 కోట్ల మంది దేశీయ పర్యాటకులను ఆకర్షించగా 2022లో ఏకంగా 19.27 కోట్ల మందిని ఆకర్షించింది. అంటే 2021తో పోలిస్తే 2022లో దేశీయ పర్యాటకుల సంఖ్య 107 శాతం పెరిగింది. – సాక్షి, అమరావతి 84.76 శాతం పర్యాటకులు ఆ రాష్ట్రాలకే.. ఇక 2022లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్–10 రాష్ట్రాల్లోనే 84.76 శాతం మంది ఉన్నారని, మిగతా రాష్ట్రాల్లో కేవలం 15.24 శాతం ఉన్నట్లు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. నిజానికి.. కోవిడ్ కారణంగా 2021లో దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సంఖ్య తగ్గింది. ఆ ఏడాది దేశం మొత్తం మీద పర్యాటకుల సంఖ్య 67.76 కోట్లు మాత్రమే ఉంది. అదే 2022లో భారీగా పెరిగింది. ఈ ఏడాది ఆ సంఖ్య మొత్తం 173.10 కోట్లు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే, 2021తో పోలిస్తే 2022లో దేశీయ పర్యాటకుల సంఖ్య 155.45 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ పూర్వ స్థితితో పోలిస్తే దేశీయ పర్యాటకుల వృద్ధి 2022లో 25.45 శాతం క్షీణించిందని.. అయినప్పటికీ 2020, 2021లో కన్నా 2022లో దేశీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు.. 2022లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్–10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్ కూడా ఉన్నాయి. -
మూడో స్థానంలో బంగ్లాదేశ్
ఫతుల్లా: అండర్-19 ప్రపంచకప్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. శనివారం శ్రీలంకతో జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో బంగ్లా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 48.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అసలంక (76) టాప్ స్కోరర్. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 49.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 218 పరుగులు చేసింది. మెహదీ హసన్ మిరాజ్ (53) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.