అర్జున్‌కు రజతం | Arjun Gets Silver Medal | Sakshi
Sakshi News home page

అర్జున్‌కు రజతం

Aug 12 2019 10:07 AM | Updated on Aug 12 2019 10:07 AM

Arjun Gets Silver Medal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అండర్‌–9 ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆదిరెడ్డి అర్జున్, ఆకుల సుహాస్‌ మెరుగైన ప్రదర్శన కనబరిచారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈటోర్నీలో అర్జున్‌ రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సాధించగా... సుహాస్‌ కాంస్యాన్ని అందుకున్నాడు. టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల అనంతరం అర్జున్, సుహాస్‌ 9 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మెరుగై టై బ్రేక్‌ ఆధారంగా ర్యాంకుల్ని వర్గీకరించగా అర్జున్‌ రెండో స్థానంలో, సుహాస్‌ మూడో స్థానంలో నిలిచారు. తమిళనాడుకు చెందిన జి. ఆకాశ్‌ 9.5 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. అర్జున్, సుహాస్‌లిద్దరూ 8 గేముల్లో గెలిచి, మరో రెండు గేముల్ని డ్రాగా ముగించారు. చెరో గేమ్‌లో ఓడిపోయారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement