
సన్‌వే ఫార్మెన్‌టెరా అంతర్జాతీయ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ రన్నరప్‌గా నిలిచాడు. స్పెయిన్‌లో ముగిసిన ఈ టోర్నీ లో నిర్ణీత 10 రౌండ్ల తర్వాత ఫెదోసీవ్ వ్లాదిమిర్ (రష్యా), కార్తీక్ వెంకటరామన్ (భారత్), ప్రణవ్ (భారత్), లియోన్ ల్యూక్ మెండోకా (భారత్) ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
విజేతను నిర్ణయించేందుకు ఈ నలుగురి మధ్య ప్లే ఆఫ్ గేమ్‌లను నిర్వహించారు. వ్లాదిమిర్, కార్తీక్ ఫైనల్ చేరగా.. ఫైనల్లో కార్తీక్‌పై నెగ్గి వ్లాదిమిర్ విజేతగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment