
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాళ్లకు రెండు పతకాలు లభించాయి. గుజరాత్‌లో శుక్రవారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో ఓపెన్ విభాగంలో ఎం.శ్రీశ్వాన్ (9.5 పాయింట్లు) రజతం... జి. ఆదిత్య వరుణ్ (9 పాయింట్లు) కాంస్యం సాధించారు. నిర్ణీత 11 రౌండ్‌ల తర్వాత శ్రీశ్వాన్ 9.5 పాయింట్లతో ఆర్యన్ (ఢిల్లీ)తో కలసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా ఆర్యన్ విజేతగా... శ్రీశ్వాన్ రన్నరప్‌గా నిలిచారు.