
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అండర్–11 చెస్ చాంపియన్‌షిప్‌లో జాహ్నవి శ్రీ లలిత, ప్రణీత్ ఉప్పల చాంపియన్‌లుగా నిలిచారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో బాలికల విభాగంలో 5.5 పాయింట్లతో జాహ్నవి, సేవితా విజు తొలి స్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా జాహ్నవి విజేతగా నిలవగా, సేవిత రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
నేత్ర, నాగలక్ష్మి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టుకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో నిర్ణీత ఏడు రౌండ్లకుగానూ ఏడు పాయింట్లు సాధించిన ప్రణీత్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చిద్విలాస్ (6 పాయింట్లు) రన్నరప్‌గా నిలిచాడు. వీరిద్దరూ రాష్ట్ర బాలుర జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్లు కరైకుడిలో ఈనెల 28న జరిగే జాతీయ అండర్–11 చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment