సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల తన ట్విట్టర్ వేదికగా ఒక బాలుడి గురించి చెప్పుకొచ్చారు, ఇలాంటి వారే భారతదేశం భవిష్యత్తుని నిర్ణయిస్తారని వెల్లడించాడు, ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల తమిళనాడులోని హోసూర్‌లో జరిగిన స్కూల్ చెస్ పోటీకి సుమారు 1600 మంది పిల్లలు హాజరయ్యారు, ఇందులో ఒక బాలుడు తాను ఈ పోటీల్లో పాల్గొనటానికి రాత్రి మొత్తం రెండు బస్సులలో ప్రయాణించి పోటీ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే మ్యాచ్ జరగటానికి ముందు ఒక చిన్న కునుకు తీసాడు. జరగబోయే పోటీలో విజయం పొందటమే అతని లక్ష్యం.
ఆనంద్ మహీంద్రా ఈ పోస్టుని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీనికి మండే మోటివేషన్ అంటూ క్యాప్సన్ కూడా ఇచ్చారు. ఇది ఎంతో మందిని ఆకర్షించింది. నిజానికి ఇలాంటివి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయి.
కొంత మంది ఈ పోస్ట్ చూసి కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఇందులో పిల్లల నుంచి మనం చాలా విషయాలను నేర్చుకోవాలని, వారు అందరికి స్ఫూర్తిదాయకమని, ఆల్ ది బెస్ట్, ఛాంప్ అంటూ.. భారతదేశానికి కీర్తి తెచ్చే అంకితభావం కలిగి మేధావులు ఉంటారని మరికొందరు అన్నారు.
A recent school chess competition in Hosur had 1600 kids from all over. This boy traveled all night by bus (changing buses twice) then walked from the depot. Took a nap before the match. Wants to be the next Magnus. Kids like him shape India’s future. He’s my #MondayMotivation pic.twitter.com/1WhlapiLCn
— anand mahindra (@anandmahindra) February 27, 2023
Comments
Please login to add a commentAdd a comment