Young children
-
భారతదేశ భవిష్యత్తుని మార్చేది ఇలాంటివారే: ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' ఇటీవల తన ట్విట్టర్ వేదికగా ఒక బాలుడి గురించి చెప్పుకొచ్చారు, ఇలాంటి వారే భారతదేశం భవిష్యత్తుని నిర్ణయిస్తారని వెల్లడించాడు, ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల తమిళనాడులోని హోసూర్‌లో జరిగిన స్కూల్ చెస్ పోటీకి సుమారు 1600 మంది పిల్లలు హాజరయ్యారు, ఇందులో ఒక బాలుడు తాను ఈ పోటీల్లో పాల్గొనటానికి రాత్రి మొత్తం రెండు బస్సులలో ప్రయాణించి పోటీ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే మ్యాచ్ జరగటానికి ముందు ఒక చిన్న కునుకు తీసాడు. జరగబోయే పోటీలో విజయం పొందటమే అతని లక్ష్యం. ఆనంద్ మహీంద్రా ఈ పోస్టుని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. దీనికి మండే మోటివేషన్ అంటూ క్యాప్సన్ కూడా ఇచ్చారు. ఇది ఎంతో మందిని ఆకర్షించింది. నిజానికి ఇలాంటివి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాయి. కొంత మంది ఈ పోస్ట్ చూసి కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఇందులో పిల్లల నుంచి మనం చాలా విషయాలను నేర్చుకోవాలని, వారు అందరికి స్ఫూర్తిదాయకమని, ఆల్ ది బెస్ట్, ఛాంప్ అంటూ.. భారతదేశానికి కీర్తి తెచ్చే అంకితభావం కలిగి మేధావులు ఉంటారని మరికొందరు అన్నారు. A recent school chess competition in Hosur had 1600 kids from all over. This boy traveled all night by bus (changing buses twice) then walked from the depot. Took a nap before the match. Wants to be the next Magnus. Kids like him shape India’s future. He’s my #MondayMotivation pic.twitter.com/1WhlapiLCn — anand mahindra (@anandmahindra) February 27, 2023 -
బలమైన కోరిక కాబట్టే నెరవేరిందేమో!
‘‘పెద్దయ్యాక నువ్వు ఏం కావాలనుకుంటున్నావ్?’’ అని చిన్నపిల్లలను అడిగితే, డాక్టర్ అనో, పోలీస్ అనో, హీరో అనో, హీరోయిన్ అనో.. ఇలా ఎవరికి తోచినది వాళ్లు చెబుతుంటారు. తమన్నా అయితే ‘నేను డాక్టర్ అవుతా... హీరోయిన్ అవుతా’ అని రెండు కోరికలు చెప్పేవారట. ఆ విషయం గురించి తమన్నా ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ - ‘‘చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు కాబట్టి, ఏదో ఒకటి మాట్లాడించాలని ‘పెద్దయ్యాక ఏమవుతావ్?’ అని అడుగుతుంటారు. అప్పుడు పిల్లలు వాళ్ల నోటికి ఏది వస్తే అది చెప్పేస్తారు. చిన్నప్పుడు చెప్పిన ప్రొఫెషన్స్‌లో పెద్దయ్యాక సెటిల్ అయ్యేవాళ్లు ఏ కొద్దిమందో ఉంటారు. ఏజ్ పెరిగే కొద్దీ అభిప్రాయాలు మారుతుంటాయి. నన్నే తీసుకోండి. డాక్టర్, యాక్టర్ రెండు ప్రొఫెషన్స్ గురించి చెప్పేదాన్ని. కానీ, పెద్దయ్యాక వైద్య వృత్తి గురించి అస్సలు ఆలోచించలేదు. పదమూడేళ్ల వయసులో సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. చిన్నప్పుడు నేను చెప్పిన రెండు కోరికల్లో అది కూడా ఒకటి కాబట్టి, ఒప్పేసుకున్నాను. బహుశా ఎక్కడో ఒక మూల హీరోయిన్ కావాలనే కోరికే బలంగా ఉండి ఉంటుందేమో. అందుకే డాక్టర్ని కాకుండా యాక్టర్‌ని అయిపోయాను. ఒకవేళ సినిమాలకు అవకాశం రాకపోయి ఉంటే అప్పుడు డాక్టర్‌గా సెటిలై ఉండేదాన్నేమో’’ అని చెప్పారు. -
అతిసార వ్యాధి (డయేరియా)కి హోమియోపతిలో చికిత్స ఉందా?
హోమియా కౌన్సెలింగ్ వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువగా వినపడేది అతిసారవ్యాధి గురించే. అసలు అతిసార ఎందుకు వస్తుంది? దీనికి హోమియోలో మందులు వున్నాయా? - కావూరి సురేష్, హైదరాబాద్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ప్రజా ఆరోగ్య సమస్యల్లో చిన్నపిల్లల్లో వచ్చే అతిసారవ్యాధి ముఖ్యమైనది, ప్రమాదకరమైనది. ప్రపంచంలో సుమారుగా 3 మిలియన్ పిల్లలు ఈ ప్రమాదకరమైన డయేరియా ద్వారా మరణిస్తున్నారు. డబ్లూ.హెచ్.ఓలో ఇది నెంబర్.1 ప్రజా ఆరోగ్య సమస్య. ఈ అతిసార వ్యాధి సాధారణంగా రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది. కానీ పిల్లల్లో వెంట వెంటనే విరేచనాలవటం వలన నిర్జలీకరణ (డిహైడ్రేషన్) జరుగుతుంది. ఒకోసారి ఇదే రక్తంతో కూడిన విరేచనాలవుతాయి. దీనినే డిసెంటరి అంటారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలలో మరణాలకు అతిసార వ్యాధి రెండో ప్రధాన కారణం. వ్యాధి లక్షణాలు: విరేచనాలు, దానితోపాటు వాంతులు, తక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం, వికారం, ఆహారం సహించకపోవడం పరీక్షలు: దీని నిర్ధారణకు విరేచన పరీక్ష చేసి, చూస్తారు. నివారణ: చికిత్స కంటే ముందు ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మల, మూత్ర విసర్జన తరువాత, చేతులు శుభ్రపరుచుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవటం, సంవత్సరం వరకు తల్లిపాలు ఇవ్వడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. డయేరియా వచ్చిన వెంటనే ప్లూయిడ్స్ ఇవ్వటం, ఓ.ఆర్.యస్ తీసుకోవటం చాలా ముఖ్యం. హోమియో చికిత్స: పిల్లలకు వచ్చే ఈ అతిసార వ్యాధిలో హోమియో మందులు బాగా పనిచేస్తాయి. పోడోఫైలమ్: అతి దాహం, చల్లని నీళ్లు తాగాలన్న కోరిక ఉండి, దుర్వాసనతో కూడిన విరేచనాలు సడన్‌గా అయ్యే రోగికి ఇది మంచి మందు. ఆర్సెనికమ్ ఆల్బ్: కలుషిత ఆహారం, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే వ్యాధికి ఇది అద్భుతమైన ఔషధం. వెరట్రమ్ ఆల్బ్: శరీరం బలహీనమై కడుపునొప్పితో విరేచనాలు అయ్యేవారికి ఇది మంచి ఔషధం. ఇంకా కామమిల్ల, అలోస్, చైనా అనే మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
బాబుకు తరచు జ్వరం..?
పీడియాట్రీషియన్ కౌన్సెలింగ్ మా బాబుకు 6 నెలలు. వాడికి ఇటీవల రెండుసార్లు జ్వరం వస్తే డాక్టర్‌కు చూపించాం. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల ఇలా తరచూ జ్వరం వస్తున్నట్లు చెప్పారు. ఇంత చిన్న పిల్లల్లోనూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయా? అలా రాకుండా ఉండాలంటే మేము ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? - సావిత్రి, తుని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెలల పిల్లల్లో కూడా చాలా సాధారణమే. చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్, అనువంశీకంగా కనిపించడం, వ్యాధి నిరోధక శక్తి, మూత్రకోశానికి సంబంధించి అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలుండటం, మూత్రవిసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపల మిగిలిపోవడం, మలబద్ధకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటి అనేక కారణాలతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. జ్వరం, తేలిగ్గా చిరాకు పడుతుండటం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను గుర్తించినప్పుడు వారిలో మూత్రకోశ వ్యవస్థకు సంబంధించి ఏదైనా లోపాలు ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరి. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్ (వీయూఆర్), మూత్రపిండాల్లో ఏవైనా తేడాలు (కిడ్నీ అబ్నార్మాలిటీస్) వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ విత్ కల్చర్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్, వీసీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి న్యూక్లియర్ స్కాన్ వంటి పరీక్షలతో పాటు రీనల్ ఫంక్షన్ పరీక్షలు చేయించడం తప్పనిసరి. చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యూరినరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్దపిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకునేలా అలవాటు చేయడం అవసరం. మీరు పైన పేర్కొన్న విషయాలను అనుసరిస్తూ తగిన పరీక్షలు చేయించుకుని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్సను కొనసాగించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హెదరాబాద్ -
స్వీట్ కిడ్స్
చిన్నపిల్లల్లో డయాబెటిస్ డయాబెటిస్ రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ పోతుడడంతో ఈ వ్యాధి ఒక చర్చనీయాంశమైంది. ఈ రోగుల సంఖ్య ఒక సామాజిక ఉపద్రవంగా మారుతుండటం కలవరం కలిగిస్తోంది. క్రితం తరంతో పోలిస్తే ఈ తరంలో మరీ చిన్న వయసు పిల్లల్లోనూ డయాబెటిస్ కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది. అయితే పెద్దల్లోని డయాబెటిస్పైనే ఎక్కువ చర్చ జరుగుతోంది తప్ప... దీనిపై అంతగా దృష్టిసారించడం లేదు. ఇప్పటికీ అదృష్టవశాత్తు పెద్దవయసులో డయాబెటిస్ వచ్చే రోగులతో పోలిస్తే చిన్న వయసులో డయాబెటిస్ వచ్చే రోగుల సంఖ్య తక్కువగానే ఉండటం కొంత ఊరటనిచ్చే విషయం. కానీ... చిన్నపిల్లల్లో డయాబెటిస్ వస్తే తక్షణం దాన్ని నిర్ధారణ చేసుకొని, రక్తంలో పెరిగే చక్కెరపాళ్లను నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. లేకపోతే అది చాలా తీవ్రమైన, ఆందోళనకరమైన పరిణామాలకు దారితీయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇందులో ఇన్సులిన్ లోపం వల్ల ఆహారాన్ని శక్తిగా మార్చుకునే ప్రక్రియల్లో తేడాలు వస్తాయి. పిల్లల్లో స్థూలకాయం ఉన్నవారిలో ఇన్సులిన్ తన కార్యకలాపాలను సక్రమంగా కొనసాగించలేదు. డయాబెటిస్‌లో రెండు రకాలు ఉంటాయి. మొదటిది టైప్-1 డయాబెటిస్, రెండోది టైప్-2 డయాబెటిస్. చిన్నపిల్లల్లో డయాబెటిస్... చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటిస్ సాధారణంగా టైప్-1కు చెందుతుంది. దీనిలో పిల్లలు తమ జీవితాంతం ఇన్సులిన్‌పై ఆధాపడాల్సి ఉంటుంది. చిన్నపిల్లల్లో పూర్తిగా ఇన్సులిన్ లోపం ఏర్పడటం వల్లనే ఇది వస్తుంది. మన శరీరంలో పాంక్రియాస్ అనే ఒక గ్రంథిలోని బీటా-సెల్స్ అనే కణాలు ఇన్సులిన్ అనే హార్మోన్‌ను తయారు చేస్తాయి. ఈ హార్మోన్ రక్తంలో చక్కెరపాళ్లు ఎప్పుడూ నార్మల్‌గా ఉండేలా చూస్తుంది. పిల్లల్లో ఇది ఏ వయసులోనైనా రావచ్చు. చిన్నపిల్లల్లోని డయాబెటిస్ నియంత్రణ ఎలా... పిల్లల్లో వచ్చే టైప్-1 డయాబెటిస్‌ను నియంత్రించడానికి చర్మం కింది పొర అయిన సబ్‌క్యుటేనియస్ పొరలోకి ఇన్సులిన్ ఎక్కించాలి. ఇక ఆహారం విషయానికి వస్తే చక్కెర పాళ్లు అస్సలు లేకుండా అన్ని రకాల పోషకాలూ అందేలా సమతులాహారం ఇవ్వాలి. చికిత్స విజయవంతం కావాలంటే... ప్రతి చిన్నారికీ... అతడి లేదా ఆమె పరిస్థితిని బట్టి వ్యక్తిగతంగా ఆహారం, వ్యాయామం, మందుల పాళ్లను నిర్ణయించాల్సి ఉంటుంది. రోగి రక్తంలో తగినంత చక్కెరపాళ్లు మాత్రమే ఉండేలా చేయడమే చికిత్స ప్రధాన ఉద్దేశం. దీనిలో జాప్యం జరిగితే అది చిన్నారి మూత్రపిండాలు, నరాలు లేదా కనుచూపునకు సంబంధించిన సమస్యలకు దారితీసే అవకాశాలుంటాయి. సిరంజీ ద్వారా తగిన మోతాదులో ఇన్సులిన్ ఇవ్వడం వల్ల రోగికి అవసరమైనంత మేరకే రక్తంలో చక్కెర పాళ్లు ఉండేలా చేయడం జరుగుతుంది. ఇలా చేయడంలో రోగి తీసుకునే ఆహారమూ, అతడికి/ఆమెకు ఇవ్వాల్సిన ఇన్సులిన్ పాళ్లూ, రోగి చేసే వ్యాయామం ఎంతో పరిగణనలోకి తీసుకొని ఆహారం, మందుల మోతాదులను సరిగ్గా నిర్ణయించాల్సి ఉంటుంది. రక్తంలోని చక్కెరపాళ్లు ఎప్పుడూ అవసరమైనంతే ఉంటూ నిర్ణీతమైన రేంజిలోనే ఉండేలా పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్‌లు చూస్తుంటారు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ అతడు/ఆమె పెరుగుదల ఆధారంగా చిన్నారి తీసుకునే మందుల మోతాదులతో పాటు అతడి ఆహారంలో పిండిపదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు ఎంతెంత ఉండాలో నిర్ణయిస్తారు. చికిత్స విషయంలో భవిష్యత్తు ఆశలు... ప్రస్తుతానికి చిన్నారుల్లో వచ్చే టైప్-1 డయాబెటిస్‌కు ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం మాత్రమే ప్రధాన చికిత్సగా ఉన్నా... ఈ అంశంపై విశేషంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎన్నెన్నో ఆశాజనకమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తునికి మాత్రం సర్జరీలు, ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియలు చిన్న పిల్లల విషయంలో సిఫార్సు చేయడం లేదు. ఇక టైప్-2 డయాబెటిస్ అనేది పెద్దల్లో వచ్చే సమస్య. ఆధునిక నాగరికత పేరిట ఆహారం, విహారాల విషయంలో పెరుగుతున్న మన అనారోగ్యకరమైన జీవనశైలి దీన్ని మరింతగా ప్రేరేపిస్తోంది. మన శరీరంలోకి వెలువడే అదనపు చక్కెరను నియంత్రించాల్సిన ఇన్సులిన్ తగినంతగా విడుదల అయినా... పెద్దవారిలో (అడల్ట్స్‌లో) ఉండే కొవ్వు ఆ ఇన్సులిన్ పనితీరుకు ప్రతిబంధకంగా మారుతుంది. దాంతో ఈ తరహా వ్యక్తుల్లో మెడ వెనక భాగంలోనూ, బాహుమూలాల వద్ద, తొడల వద్ద నల్లటి చారలను ఏర్పరుస్తుంది. మనలో ఇన్సులిన్ సరిగా పనిచేయడం లేదనే విషయానికి ఇది ఒక భౌతికంగా కనిపించే గుర్తు. ఇక స్థూలకాయం ఉండే పిల్లల్లో టైప్-2 డయాబెటిస్ కూడా ఉందేమో చూడాలి. కుటుంబ చరిత్రలో డయాబెటిస్ ఉన్న పెద్దవారికి మెడపై ఈ పిగ్మెంటేషన్ ఉంటే... వారి పిల్లల్లో డయాబెటిస్ రావడంతో పాటు అమ్మాయిల్లో పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్), రుతుక్రమం సరిగా రాకపోవడం, శరీరంపై అవాంఛిత రోమాలు కనిపించడం, రక్తపోటు పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు రక్తపరీక్ష, మూత్రపరీక్షల వంటివి చేసి పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో మందులు, న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు ఆహారంతో పాటు బిహేవియర్ స్పెషలిస్ట్ సలహా, సూచనలతో వ్యాధిని అదుపులో పెట్టడం ఎలాగో తెలుసుకోవాలి. ఒకవేళ పిల్లలు అన్ని రకాలుగా బాగానే ఉండి, అతడిలో కేవలం టైప్-2 డయాబెటిస్ వచ్చే లక్షణాలు కనిపిస్తుంటే... అప్పుడు ఆ చిన్నారుల జీవనశైలి, ఆహారం, వ్యాయామాలు, బరువును అదుపులో పెట్టుకోవడం ఎలా అనే అంశాలపై అవగాహన కలిగించాలి. ఇవన్నీ అతడి రక్తంలోని చక్కెరపాళ్లను అదుపు చేయలేకపోతే అప్పుడు నోటి ద్వారా మందులు ఇవ్వడమో లేదా ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడమో చేయాలి. ఆ వయసు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటి, ఎన్ని సార్లు ఎంతెంత మోతాదుల్లో (పోర్షన్స్)తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించాలి. ఇలాంటి పిల్లలు రోజుకు కనీసం ఒక గంటసేపైనా శారీరకమైన శ్రమ చేయాల్సి ఉంటుంది. ఇలా టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలున్న పిల్లలను గుర్తించి వారి జీవనశైలిలో మార్పులు తీసుకురావడం వల్ల డయాబెటిస్‌ను సాధ్యమైనంతగా నివారించవచ్చ్చు లేదా ఆలస్యం చేయవచ్చు. కానీ టైప్-1 డయాబెటిస్ నివారణ సాధ్యం కాదు. కాబట్టి వారి విషయంలో అత్యవసరంగా వైద్యనిపుణుల సలహా తీసుకోవాలి. లక్షణాలు... చిన్నపిల్లల్లో డయాబెటిస్ వచ్చాక ఆ చిన్నారిలో కొద్ది రోజులు లేదా వారాల్లోనే దానికి సంబంధించిన లక్షణాలు కనబడతాయి. అవి... చాలా ఎక్కువగా దాహం వేస్తుండటం ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్తుండటం ఒక్కోసారి నిద్రలో పక్క తడపడం క్రమంగా బరువు తగ్గుతుండటం ఎప్పుడూ అలసటగా ఉండటం. ఈ దశలోనే తల్లిదండ్రులు గమనించి వ్యాధి నిర్ధారణ చేయించాలి. వ్యాధి నిర్ధారణ ఆలస్యమైతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తీవ్రమైన డీహైడ్రేషన్ (శరీరంలోని నీరు, లవణాలను ఎక్కువ పరిమాణంలో కోల్పోవడం), కడుపునొప్పి, వాంతులు, మత్తుగా ఉండటం, శ్వాస తీసుకోవడం కష్టం కావడం వంటి లక్షణాలు కనపడవచ్చు. అప్పుడు రక్తనాళంలోకి సెలైన్‌తో పాటు ఇన్సులిన్ ఎక్కించాల్సి రావచ్చు.