హోమియా కౌన్సెలింగ్
వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువగా వినపడేది అతిసారవ్యాధి గురించే. అసలు అతిసార ఎందుకు వస్తుంది? దీనికి హోమియోలో మందులు వున్నాయా?
- కావూరి సురేష్, హైదరాబాద్
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ప్రజా ఆరోగ్య సమస్యల్లో చిన్నపిల్లల్లో వచ్చే అతిసారవ్యాధి ముఖ్యమైనది, ప్రమాదకరమైనది. ప్రపంచంలో సుమారుగా 3 మిలియన్ పిల్లలు ఈ ప్రమాదకరమైన డయేరియా ద్వారా మరణిస్తున్నారు. డబ్లూ.హెచ్.ఓలో ఇది నెంబర్.1 ప్రజా ఆరోగ్య సమస్య.
ఈ అతిసార వ్యాధి సాధారణంగా రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది. కానీ పిల్లల్లో వెంట వెంటనే విరేచనాలవటం వలన నిర్జలీకరణ (డిహైడ్రేషన్) జరుగుతుంది. ఒకోసారి ఇదే రక్తంతో కూడిన విరేచనాలవుతాయి. దీనినే డిసెంటరి అంటారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలలో మరణాలకు అతిసార వ్యాధి రెండో ప్రధాన కారణం.
వ్యాధి లక్షణాలు: విరేచనాలు, దానితోపాటు వాంతులు, తక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం, వికారం, ఆహారం సహించకపోవడం
పరీక్షలు: దీని నిర్ధారణకు విరేచన పరీక్ష చేసి, చూస్తారు.
నివారణ: చికిత్స కంటే ముందు ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మల, మూత్ర విసర్జన తరువాత, చేతులు శుభ్రపరుచుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవటం, సంవత్సరం వరకు తల్లిపాలు ఇవ్వడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. డయేరియా వచ్చిన వెంటనే ప్లూయిడ్స్ ఇవ్వటం, ఓ.ఆర్.యస్ తీసుకోవటం చాలా ముఖ్యం.
హోమియో చికిత్స: పిల్లలకు వచ్చే ఈ అతిసార వ్యాధిలో హోమియో మందులు బాగా పనిచేస్తాయి.
పోడోఫైలమ్: అతి దాహం, చల్లని నీళ్లు తాగాలన్న కోరిక ఉండి, దుర్వాసనతో కూడిన విరేచనాలు సడన్‌గా అయ్యే రోగికి ఇది మంచి మందు.
ఆర్సెనికమ్ ఆల్బ్: కలుషిత ఆహారం, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే వ్యాధికి ఇది అద్భుతమైన ఔషధం.
వెరట్రమ్ ఆల్బ్: శరీరం బలహీనమై కడుపునొప్పితో విరేచనాలు అయ్యేవారికి ఇది మంచి ఔషధం.
ఇంకా కామమిల్ల, అలోస్, చైనా అనే మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
అతిసార వ్యాధి (డయేరియా)కి హోమియోపతిలో చికిత్స ఉందా?
Published Tue, Jul 28 2015 11:58 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM
Advertisement
Advertisement