diarrheal disease
-
డయేరియా మరణాలపై మంత్రి అవహేళన
-
కూటమి ప్రభుత్వంపై YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
-
Diarrhea: వందల మందిని వణికిస్తున్న డయేరియా
-
డయేరియా మరణాల పాపం ప్రభుత్వానిదే, ఏపీలో మైన్స్, వైన్స్ దోపిడీ
-
గుర్ల గ్రామంలో అడుగుపెట్టిన జగన్..
-
డయేరియా తీవ్రతను జగన్ కు వివరించిన గుర్ల బాధితులు
-
గుర్ల శిబిరంలో సౌకర్యాల లేమిపై ఎక్స్ లో ప్రశ్నించిన YS జగన్
-
డయేరియా మరణాలు.. పవన్ పై YSRCP నేత ఫైర్
-
వైఎస్ జగన్ ప్రశ్నించడంతో.. కళ్లు తెరిచిన ప్రభుత్వం
-
విజయనగరం జిల్లాలో తగ్గని డయేరియా తీవ్రత
-
వైద్య శిబిరంలో కనీస సౌకర్యాలు లేవు: సీదిరి అప్పలరాజు
-
డయేరియా మరణమృదంగం..
-
విజయనగరంలో డయేరియా కలకలం.. 11కు చేరిన మరణాలు
సాక్షి, విజయనగరం: ఏపీలో డయేరియా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయనగరం జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. తాజాగా మరో ఇద్దరు మృతిచెందడంతో మృతుల సంఖ్య 11కు చేరుకుంది.తాజాగా విజయనగరంలోని గుర్ల మండలం నాగళ్లవలసలో డయేరియాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో, జిల్లాలో డయేరియా మృతుల సంఖ్య 11కు చేరింది. ఇక, మరో 200 మందికిపైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా కారణంగా గుర్ల, గరివిడి, చీపురుపల్లి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
డయేరియా గుప్పెట్లో విజయనగరం
-
విజయనగరం జిల్లాలో విజృంభిస్తోన్న డయేరియా
-
తిరుపతిలో డయేరియా డేంజర్ బెల్స్
-
అధికారుల నిర్లక్ష్యంతో ఇద్దరి ప్రాణాలు బలి
-
తిరుపతి రుయా ఆసుపత్రిలో విషాదం
-
పల్నాడు జిల్లాలో విజృంభిస్తున్న డయేరియా
-
భారీగా పెరుగుతున్న డయేరియా కేసులు
-
డయేరియా డేంజర్ బెల్స్
-
ఏపీలో డయేరియా కలకలం.. 10 మంది మృతి
-
ఏపీలో డయేరియా విజృంభణ..
-
అతిసార బాధిత కుటుంబాలకు రూ. 3లక్షలు: ఆళ్ల నాని
సాక్షి, కర్నూలు: గత కొద్ది రోజులుగా జిల్లాలో అతిసార వ్యాధి బారిన పడి పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అతిసారంతో మృతి చెదిన వారి కుటుంబాలకు 3 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. గోరుకల్లు వాసులను ఆదుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘గోరుకల్లులో పైప్‌లైన్‌ను మార్చేందుకు 25 లక్షల రూపాయలు కేటాయించాం. తాగునీటిని హైదరాబాద్, విజయవాడ ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయిస్తాం. గోరకల్లులో 24 గంటలు పని చేసేలా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తాం. డయేరియా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అనారోగ్యం ఉన్నవారు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలి. అక్కడ మంచి వైద్యం అదుతుంది’’ అని ఆళ్ల నాని తెలిపారు. చదవండి: కరోనాపై ప్రత్యేక దృష్టి సారించాలి -
ఆదోనిలో ప్రబలిన అతిసారం
ఆదోని/అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అరుంజ్యోతినగర్‌లో బుధవారం అతిసారం ప్రబలింది. 50 మందికిపైగా అస్వస్థతకు గురికాగా.. ఒక మహిళ రంగమ్మ (50) మృతి చెందింది. బాధితుల్లో 20 మంది పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరికి స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యం చేస్తుండగా మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. బాధితుల్లో పదేళ్లలోపు వయసు కలిగినవారు 8 మంది ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తాగునీరు, పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డిని ఆదేశించారు. ఆర్డీఓతో పాటు మునిసిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రంగనాయక్, తహసీల్దారు రామకృష్ణ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి పంపించినట్లు ఆస్పత్రి చీఫ్ డాక్టర్ లింగన్న వారికి తెలిపారు. అనంతరం ఆర్డీవో తదితరులు అరుంజ్యోతినగర్‌లో పర్యటించి.. ఓవర్ హెడ్ ట్యాంకులు, మురుగుకాలువలను శుభ్రం చేయించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. తాగునీరు కలుషితం అవడంవల్లే అతిసారం ప్రబలిందని స్థానికులు తెలిపారు. తాగునీటి నమూనాలను పరీక్షలకు పంపినట్లు ఆర్డీవో చెప్పారు. మంగళవారం ఇక్కడ దేవర జరిగిందని, ఫుడ్ పాయిజనింగ్‌కు కూడా అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గోరుకల్లులో మరొకరు మృతి పాణ్యం: కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో అతిసారవ్యాధికి మరొకరు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మంగళవారం గ్రామానికి చెందిన ఉప్పరి ఎరబోయిన ఉసేని (65), సుంకరి ఎల్ల కృష్ణ (35) చనిపోగా.. బుధవారం తమ్మడపల్లె మద్దమ్మ (75) నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. గ్రామంలో బుధవారం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు. -
మహబూబ్‌నగర్ జిల్లాలో అతిసార వ్యాధి
-
చేతుల్లోనే చివరి శ్వాస..
అతిసారంతో విద్యార్థి మృతి లింగంపేట: మూడు రోజులుగా అతిసార వ్యాధితో బాధపడుతున్న ఓ బాలుడు.. అందరూ చూస్తుండగానే చేతుల్లోనే ప్రాణాలొదిలాడు. నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం సురాయిపల్లి తుల్జానాయక్ తండాకు చెందిన రమావత్ మహేశ్ (8) వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నా డు. శుక్రవారం సాయంత్రం కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు వసురాం, సక్రీ 108 అంబులెన్స్‌కు సమాచారం అందజేశారు. కానీ, ఆ వాహనం వచ్చేలోపే.. అందరూ చూస్తుండగానే వారి చేతుల్లోనే ఆ బాలుడు మృతి చెందాడు. తండాలో మరికొందరు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ హైదరాబాద్, కామారెడ్డి, లింగంపేటల్లో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. -
అతిసార వ్యాధి (డయేరియా)కి హోమియోపతిలో చికిత్స ఉందా?
హోమియా కౌన్సెలింగ్ వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువగా వినపడేది అతిసారవ్యాధి గురించే. అసలు అతిసార ఎందుకు వస్తుంది? దీనికి హోమియోలో మందులు వున్నాయా? - కావూరి సురేష్, హైదరాబాద్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన ప్రజా ఆరోగ్య సమస్యల్లో చిన్నపిల్లల్లో వచ్చే అతిసారవ్యాధి ముఖ్యమైనది, ప్రమాదకరమైనది. ప్రపంచంలో సుమారుగా 3 మిలియన్ పిల్లలు ఈ ప్రమాదకరమైన డయేరియా ద్వారా మరణిస్తున్నారు. డబ్లూ.హెచ్.ఓలో ఇది నెంబర్.1 ప్రజా ఆరోగ్య సమస్య. ఈ అతిసార వ్యాధి సాధారణంగా రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది. కానీ పిల్లల్లో వెంట వెంటనే విరేచనాలవటం వలన నిర్జలీకరణ (డిహైడ్రేషన్) జరుగుతుంది. ఒకోసారి ఇదే రక్తంతో కూడిన విరేచనాలవుతాయి. దీనినే డిసెంటరి అంటారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలలో మరణాలకు అతిసార వ్యాధి రెండో ప్రధాన కారణం. వ్యాధి లక్షణాలు: విరేచనాలు, దానితోపాటు వాంతులు, తక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం, వికారం, ఆహారం సహించకపోవడం పరీక్షలు: దీని నిర్ధారణకు విరేచన పరీక్ష చేసి, చూస్తారు. నివారణ: చికిత్స కంటే ముందు ఇది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మల, మూత్ర విసర్జన తరువాత, చేతులు శుభ్రపరుచుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవటం, సంవత్సరం వరకు తల్లిపాలు ఇవ్వడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. డయేరియా వచ్చిన వెంటనే ప్లూయిడ్స్ ఇవ్వటం, ఓ.ఆర్.యస్ తీసుకోవటం చాలా ముఖ్యం. హోమియో చికిత్స: పిల్లలకు వచ్చే ఈ అతిసార వ్యాధిలో హోమియో మందులు బాగా పనిచేస్తాయి. పోడోఫైలమ్: అతి దాహం, చల్లని నీళ్లు తాగాలన్న కోరిక ఉండి, దుర్వాసనతో కూడిన విరేచనాలు సడన్‌గా అయ్యే రోగికి ఇది మంచి మందు. ఆర్సెనికమ్ ఆల్బ్: కలుషిత ఆహారం, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే వ్యాధికి ఇది అద్భుతమైన ఔషధం. వెరట్రమ్ ఆల్బ్: శరీరం బలహీనమై కడుపునొప్పితో విరేచనాలు అయ్యేవారికి ఇది మంచి ఔషధం. ఇంకా కామమిల్ల, అలోస్, చైనా అనే మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
కుదిపేసిన అతిసార
- గువ్వలదిన్నెలో బాలుడి మృతి - మరో 20 మందికి తీవ్ర అస్వస్థత - గ్రామాన్ని సందర్శించిన ఆర్డీఓ ధరూరు: మండలంలోని గువ్వలదిన్నె గ్రామాన్ని అతిసారవ్యాధి కుదిపేసింది. సోమవారం వాంతులు, విరేచనాలతో ఓ బాలుడు మృత్యువాతపడ్డాడు. మరో 20మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు భయాందోళనతో ఆస్పత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. గ్రామానికి చెందిన వీరన్న, ఆదమ్మల కొడుకు నవీన్(9) గత రెండురోజులుగా తీవ్రమైన వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాడు. మొదట ఆర్ఎంపీకి చూపించగా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కర్ణాటకలోని రాయిచూరు ఆస్పత్రికితీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆ బాలుడు సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడు నవీన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. అస్వస్థతకు గురైన ఉసెనప్పగౌడ్, పద్మమ్మ, జ్యోతి, మల్లేష్‌గౌడ్‌తో పాటు మరో నలుగురిని చికిత్స కోసం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన వైద్యధికారులు గ్రామానికి చేరుకుని వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. ఆర్డీఓ సందర్శన.. విషయం తెలుసుకున్న గద్వాల ఆర్డీఓ భిక్షానాయక్, ఇన్చార్జి తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ నర్సింహనాయుడు, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ బషీర్ తదితరలు గ్రామానికి చేరుకుని సమీక్షించారు. తాగునీటి పైప్‌లైన్‌కు గ్రామానికి చెందిన రైతులు కొందరు డ్రిప్ పైపులను అమర్చి నీటిని అక్రమంగా వాడుకుంటున్నట్లు గుర్తించారు. ఆ డ్రిప్‌పైపులు అమర్చిన ప్రాంతాల్లో నిలిచిన నీరు తిరిగి తాగునీటి పైపుల్లోకి వెళ్లడంతో తాగునీరు కలుషితమైనట్లు గుర్తించారు. ఏడాదికాలంగా ట్యాంకును శుభ్రం చేయడం లేదని..కలుషితనీటినే తాగుతున్నామని స్థానికులు వాపోయారు. రోగులకు మెరుగైన వైద్యం - ఎమ్మెల్యే డీకే అరుణ గద్వాల న్యూటౌన్: అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే డీకే అరుణ వైద్యాధికారులను ఆదేశించారు. ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గువ్వలదిన్నె వాసులను ఆమె సోమవారం పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యం గురించి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. అతిసార ప్రబలుతున్న గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఆర్డీఓ భిక్షానాయక్కు సూచించారు. అతిసార మరింతగా విజృంభించకుండా ప్రత్యేకచర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, శంకర్, తిమ్మన్న, భాస్కర్‌యాదవ్ ఉన్నారు. -
వాంతులు, విరేచనాలుతగ్గితే ఒట్టు!
వంగూరు, న్యూస్‌లైన్: పక్షం రోజులుగా చారకొండ గ్రామస్తులను ముప్పుతిప్ప లు పెడుతున్న వాంతులు, విరేచనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. రెండురోజులుగా అతిసార మళ్లీ విజృంభించడంతో స్థానికులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. వైద్యశిబిరం ఏర్పాటుచేసి చికిత్సలు అందజేసినా వ్యాధి ఎంతమాత్రం అదుపులో కి రావడం లేదు. కడుపుకు తిండిలేక.. ఒంట్లో సత్తువలేక బాధితులు స్థానిక వై ద్యం శిబిరంలో చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి వెళ్తున్నారు. మరికొందరు నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. శనివారం మరో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీ రిలో రఘు, లక్ష్మణ్, లక్ష్మమ్మ, బుజ్జి, తేజ స్విని, ధోని, నిఖిల్, శివప్రసాద్ ఉన్నారు. వీరు స్థానిక శిబిరంలో వైద్యచికిత్సలు పొందుతున్నారు. ఇదిలాఉండగా, గతరెండు రోజులుగా వ్యాధి బారినపడిన 11 మంది కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలో చికి త్స పొందుతున్నారు. ప్రధానంగా చారకొండ పరిసర గ్రామాలైన మర్రిపల్లి, రాంపూర్, తుర్కలపల్లి, శాంతిగూడెం, సిరసనగండ్ల గ్రామాల్లోనే అతిసారవ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. గ్రా మంలో ఏర్పాటుచేసిన వైద్యశిబిరం కొనసాగుతూనే ఉంది. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోండి: డీఎంహెచ్ఓ ప్రధానంగా తాగునీరు కలుషితం కావ డం వల్లే అతిసారవ్యాధి వ్యాప్తి చెందుతుందని, చారకొండ గ్రామంలోని స్కీం బోర్ల నుంచి గాని, వాటర్ ట్యాంకుల నుంచి గాని నీటిని సరఫరా చేయకుండా నేరుగా ట్యాంకర్ల ద్వారానే ప్రజలకు సరఫరా చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారిణి(డీఎంహెచ్ఓ) రుక్మిణమ్మ అ ధికారులకు సూచించారు. శనివారం ఆ మె చారకొండ గ్రామాన్ని సందర్శించి వై ద్యశిబిరంలో చికిత్సపొందుతున్న రోగులను పరీక్షించారు. అనంతరం గ్రామ శి వారులో పైప్లైన్ల లీకేజీలతో ఏర్పడిన మురుగుకాల్వలను పరిశీలించారు. ఆ త రువాత స్థానికులు, బాధితులతో మాట్లాడారు. కలుషితమైన నీటిని తాగడం, ఆ హారలోపాల వల్లే అతిసార ప్రబలుతుం దన్నారు. చారకొండతోపాటు చుట్టుపక్క ల గ్రామాల్లో ఉన్న తాగునీటి బోర్లు, ఫి ల్టర్ వాటర్ప్లాంట్ల నీటి శాంపిల్స్‌ను ప రీక్షించేందుకు ఆదివారం జిల్లాకేంద్రం నుంచి ప్రత్యేకబృందం వస్తుందని ఆమె వివరించారు. వైద్యులు పట్టించుకోవడంలేదు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గుై రె వైద్య శిబిరం వద్దకు వస్తే ఇక్కడ ఉన్న సిబ్బంది, డాక్టర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అతిసార బాధితులు, గ్రామస్తులు డీఎంహెచ్ఓకు ఫిర్యాదుచేశారు. రెండుమందు గోళీలు ఇచ్చి రెఫర్ టు క ల్వకుర్తి అంటూ 108 ద్వారా కల్వకుర్తి ప్ర భుత్వాసుపత్రికి పంపిస్తున్నారని స్థానికు లు వాపోయారు. దీంతో ఆమె సిబ్బం దిపై అసహనం వ్యక్తంచేశారు. అవసరమైతే మరికొంత మంది సిబ్బందిని ఏ ర్పాటు చేసుకుని ఇక్కడికివచ్చే రోగులకు ఇక్కడే వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. వ్యాధి తీవ్రత ఉంటే తప్ప రె ఫర్ చేయడానికి వీల్లేదని హెచ్చరించారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే తనకు ఫోన్ చేయమని గ్రామస్తులకు సూ చించారు. డీఎంహెచ్ఓను కలిసిన వారి లో చారకొండ సర్పంచ్ శిల్పాదేవీలాల్, గ్రామస్తులు శ్రీనివాస్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, శ్రీను తదితరులు ఉన్నారు. -
చారకొండ గుండెదడ
వంగూరు, న్యూస్‌లైన్: ఆ ఊరికి దారులన్నీ బంద్ అయ్యాయి. గతకొన్ని రో జులుగా చుట్టాలు, బంధువులు రావడమే మానేశారు. పుట్టిపెరిగిన ఊరి నీళ్లను తాగడం కాదు.. చూస్తేనే ఆ గ్రామస్తులు హడలిపోతున్నారు. కొందరైతే బంధువుల వద్దకు బాటకడుతున్నారు. కారణమేమంటే అతిసార భయమే..! మండలంలోని చారకొండ వాసులు భయం గుప్పట్లో గడుపుతున్నారు. పదిరోజులుగా గ్రామాన్ని అతలాకుతలం చేస్తున్న అతిసారవ్యాధి మరోసారి తన ప్రతాపం చూపింది. దెబ్బకు చిన్నాపెద్దా అనే తేడాలేకుండా మంచం పడుతున్నారు. శుక్రవారం చారకొండ, సిరసనగండ్ల, మర్రిపల్లి గ్రామాలకు చెందిన దాదాపు మరో 15మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో చిన్నారులే అధికంగా ఉన్నారు. గ్రామంలోనే వైద్యశిబిరం ఏర్పాటుచేసి చికిత్సలు అందజేస్తున్నా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. బాధితులను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్నారు. అక్కడ కొద్దిసేపు ఉంచి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చారకొండ గ్రామానికి చెందిన సాయిప్రసన్న, శివలీల, మహేష్, నరేష్, ప్రవీణ్, సాయిచందర్, రవి, సిరసనగండ్లకు చెందిన బుచ్చమ్మ, యాదమ్మ, ముత్తయ్య, మర్రిపల్లికి చెందిన ద్రౌపతమ్మ, రాములు, ప్రశాంత్‌లతోపాటు మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. వీరికి ప్రధానంగా విరేచనాలు అధికమవడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా గ్రామంలో పారిశుధ్య పనులు చేయడంతోపాటు వైద్య శిబిరం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఇంటింటికెళ్లి తాగునీరు, తీసుకునే ఆహారపదార్థాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నప్పటికీ వ్యాధి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కలుషితమే కారణం ఈ సందర్భంగా డాక్టర్ వెంకట్‌దాస్ మాట్లాడుతూ.. వ్యాధితీవ్రత అధికమవడంతో తాము చేసేదేమీ లేదని పదిరోజులుగా తీవ్రంగా శ్రమించి వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రామంలో తాగునీరు కలుషితమవుతుందని, అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే చారకొండతో పాటు సమీపంలో ఉన్న తుర్కలపల్లి, మర్రిపల్లి, మర్రిపల్లి తండా, శాంతిగూడెం, అగ్రహారం తండా, సిరసనగండ్ల గ్రామాల్లోనే వ్యాధితీవ్రత కనిపిస్తోంది. చర్యలు మరిచిన అధికారులు చారకొండ గ్రామాన్ని అతలాకుతలం చేస్తున్న అతిసారవ్యాధిని అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు మొక్కుబడిగా ఉన్నాయని గ్రామస్తులు పెదవివిరుస్తున్నారు. గ్రామంలో తాగునీరు సరఫరా అయ్యే పైప్‌లైన్ లీకేజీ అయి మురుగునీరు చేరినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. గత 20 రోజుల క్రితం తాగునీటికోసం నూతనంగా పైప్‌లైన్ వేసేందుకు జేసీబీతో గుంతలు తీసిన సమయంలో పైప్‌లైన్ పగిలింది. అక్కడ మురుగునీరు చేరి..తాగునీటి పైపులైన్లో కలుస్తోంది. తిరిగి ఆ నీరే గ్రామంలో సరఫరా అవుతోంది. గ్రామంలో ఎక్కడచూసినా అపరిశుభత్ర రాజ్యమేలుతోంది. గ్రామంలో ఏడేళ్లుగా మురికికాల్వలను శుభ్రం చేయడం లేదని స్థానికులు వాపోతుతున్నారు. అయితే గ్రామానికి నీటి సరఫరా చేసే పైప్‌లైన్ మరమ్మతులు మరిచిన అధికారులు గ్రామంలో అతిసార రావడానికి ఒక వాటర్ప్లాంటే కారణమని చెప్పి చేతులు దులుపుకోవడం సమంజసం కాదని మండిపడుతున్నారు. పైప్‌లైన్ లీకేజీ విషయాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం స్థానిక పీహెచ్సీ వైద్యులు డాక్టర్ వెంకట్‌దాస్ నేరుగా అక్కడికి వెళ్లి ఫొటోలు తీసుకుని నేరుగా డీఎంహెచ్ఓకు పంపించారు. ఇదిలాఉండగా, వారం రోజులుగా వాటర్ ట్యాంకుల నుంచి నీటి సరఫరానే నిలిపివేశామని, కేవలం వాటర్ ట్యాంకర్ల ద్వారానే తాగునీటిని సరఫరా చేస్తున్నామని అలాంటప్పుడు ఆ నీరు ఎలా కలుషితమవుతుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అతిసార ప్రబలిన నాటినుంచి గ్రామస్తులు ఫిల్టర్చేసిన నీటినే తాగుతున్నారు. అయినప్పటికీ అతిసార ఎందుకు ప్రబలుతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. గ్రామాన్ని ఉన్నతాధికారులు సందర్శించి మెరుగైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.