![Diarrhea Deaths Increased At Vizianagaram District](/styles/webp/s3/article_images/2024/10/19/Diarrhea.jpg.webp?itok=Ykt33WnW)
సాక్షి, విజయనగరం: ఏపీలో డయేరియా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విజయనగరం జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. తాజాగా మరో ఇద్దరు మృతిచెందడంతో మృతుల సంఖ్య 11కు చేరుకుంది.
తాజాగా విజయనగరంలోని గుర్ల మండలం నాగళ్లవలసలో డయేరియాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో, జిల్లాలో డయేరియా మృతుల సంఖ్య 11కు చేరింది. ఇక, మరో 200 మందికిపైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా కారణంగా గుర్ల, గరివిడి, చీపురుపల్లి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment