రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ పోటీలు ఈ నెల 25, 26 తేదీల్లో సూర్యాపేటలో జరుగనున్నాయి.
విజేతకు10 వేల నగదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ పోటీలు ఈ నెల 25, 26 తేదీల్లో సూర్యాపేటలో జరుగనున్నాయి. పట్టణంలోని బాలుర హైస్కూల్‌లో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ చెస్ సంఘం కార్యదర్శి ఆనంచిన్ని వెంకటేశ్వర్ రావు తెలిపారు. విజేతగా నిలిచిన వారికి ట్రోఫీతో పాటు రూ. 10 వేల నగదు, రన్నరప్‌కు రూ. 3,500, కాంస్య పతక విజేతకు రూ. 2,500 నగదు బహుమతి అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా చెస్‌లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకు ఇలాంటి టోర్నీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే బాలబాలికలు సూర్యపేట జిల్లా చెస్ సంఘం కార్యదర్శి పారుపల్లి చంద్రశేఖర్ (94913–29171)ను సంప్రదించవచ్చు.