
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 చెస్ చాంపియన్‌షిప్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా గొర్లి వరుసగా ఐదో విజయం నమోదు చేసి అజేయంగా నిలిచింది. బుధవారం జరిగిన నాలుగో రౌండ్‌లో వైజాగ్‌కు చెందిన నైనా 60 ఎత్తుల్లో మీరా సింగ్ (ఢిల్లీ)పై, ఐదో రౌండ్‌లో 80 ఎత్తుల్లో ఆముక్త (ఆంధ్రప్రదేశ్)పై గెలిచింది.
ఐదో రౌండ్ తర్వాత నైనా ఐదు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణకు చెందిన సంహిత పుంగవనం, బి.కీర్తిక 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఓపెన్ విభాగంలో తెలంగాణ కుర్రాడు చల్లా సహర్ష ఐదో రౌండ్ తర్వాత 4.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి రెండో ర్యాంక్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment