national chess championship
-
జాతీయ ఓపెన్ చెస్ చాంపియన్ కార్తీక్ వెంకటరామన్
ఆద్యంతం అజేయంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కార్తీక్ వెంకటరామన్ జాతీయ సీనియర్ చెస్ చాంపియన్‌గా అవతరించాడు. హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఈ టోర్నీ మంగళవారం ముగిసింది. నిర్ణీత 11 రౌండ్లకుగాను కార్తీక్‌తోపాటు సూర్యశేఖర గంగూలీ (పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు), నీలేశ్ సాహా (రైల్వేస్) 9 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... కార్తీక్‌కు టైటిల్ వరించింది. కార్తీక్‌కు రూ. 6 లక్షలు ప్రైజ్‌మనీ లభించింది. అంతేకాకుండా 2025 ప్రపంచకప్ టోర్నీకి భారత్ తరఫున కార్తీక్ అర్హత సాధించాడు. సూర్యశేఖర గంగూలీ రన్నరప్‌గా నిలువగా, నీలేశ్ సాహా మూడో స్థానం దక్కించుకున్నాడు. మిత్రబా గుహ (రైల్వేస్)తో జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన కార్తీక్ 58 ఎత్తుల్లో గెలిచాడు. కార్తీక్కిది రెండో జాతీయ టైటిల్. 2022లో అతను తొలిసారి జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించాడు. -
రన్నరప్ రాజా రిత్విక్
జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రెండో పతకాన్ని సాధించాడు. ర్యాపిడ్ ఫార్మాట్లో కాంస్య పతకం నెగ్గిన రిత్విక్ గురువారం నాసిక్‌లో జరిగిన బ్లిట్జ్ ఫార్మాట్లో రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో రిత్విక్ 9 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. రిత్విక్ మొత్తం 11 గేముల్లో ఏడింటిలో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. 9.5 పాయింట్లతో దీప్తాయన్ ఘోష్ (రైల్వేస్) చాంపియన్‌గా నిలిచాడు. -
నైనా ఖాతాలో ఐదో విజయం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 చెస్ చాంపియన్‌షిప్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా గొర్లి వరుసగా ఐదో విజయం నమోదు చేసి అజేయంగా నిలిచింది. బుధవారం జరిగిన నాలుగో రౌండ్లో వైజాగ్‌కు చెందిన నైనా 60 ఎత్తుల్లో మీరా సింగ్ (ఢిల్లీ)పై, ఐదో రౌండ్లో 80 ఎత్తుల్లో ఆముక్త (ఆంధ్రప్రదేశ్)పై గెలిచింది. ఐదో రౌండ్ తర్వాత నైనా ఐదు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణకు చెందిన సంహిత పుంగవనం, బి.కీర్తిక 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఓపెన్ విభాగంలో తెలంగాణ కుర్రాడు చల్లా సహర్ష ఐదో రౌండ్ తర్వాత 4.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. -
డబుల్ స్వర్ణ పతకాలు సాధించిన రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఓపెన్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రెండు స్వర్ణ పతకాలు సాధించాడు. రాజా రిత్విక్, తెలంగాణకే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ హర్ష భరతకోటి, అరవింద్ చిదంబరం (తమిళనాడు), పురాణిక్ అభిమన్యు (మహారాష్ట్ర), సంకల్ప్ గుప్తా (మహారాష్ట్ర)లతో కూడిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జట్టు టీమ్ విభాగంలో 16 పాయింట్లతో విజేతగా నిలిచింది. వ్యక్తిగతంగా బోర్డు–5పై ఆడిన రాజా రిత్విక్ ఏడు పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి మరో స్వర్ణ పతకాన్ని సాధించాడు. బోర్డు–3పై ఆడిన హర్ష భరతకోటి 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 22 జట్లు పాల్గొన్నాయి. పతకాలు నెగ్గిన రాజా రిత్విక్, హర్ష భరతకోటిలను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. చదవండి: IPL 2022: 'అతడు అద్భుతమైన ఆటగాడు.. భారత జట్టులో చూడాలనుకుంటున్నాం' -
జాతీయ చెస్ చాంపియన్‌షిప్ విజేతగా అర్జున్..
కాన్పూర్: టోర్నీలో పరాజయమెరుగని గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ సీనియర్ జాతీయ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. సీనియర్ టైటిల్ సాధించిన తొలి తెలంగాణ ఆటగాడిగా ఘనత వహించాడు. ఆఖరి 11వ రౌండ్ గేమ్‌లో 18 ఏళ్ల అర్జున్ మాజీ చాంపియన్ సేతురామన్ (8)తో ‘డ్రా’ చేసుకున్నాడు. టైటిల్ రేసులో ఉన్న గుకేశ్‌కు గురువారం ఇనియన్ జతయ్యాడు. గుకేశ్ కూడా ఆర్యన్ చోప్రా (8)తో డ్రా చేసుకోగా, ఇనియన్... మిత్రభా గుహా (బెంగాల్)ను ఓడించాడు. దీంతో అర్జున్‌తో పాటు తమిళ గ్రాండ్ మాస్టర్లు గుకేశ్, ఇనియన్ ఉమ్మడిగా 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... చివరకు టైబ్రేక్ స్కోరుతో అర్జున్ను విజేతగా ఖరారు చేశారు. గుకేశ్, ఇనియన్లకు వరుసగా రజత, కాంస్య పతకాలు లభించాయి. తెలంగాణ ఆటగాడికి ట్రోఫీతో పాటు రూ. 6 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. చదవండి: టీమ్ ఈవెంట్లో ఇషాకు స్వర్ణం -
టాప్-10 లో ముగ్గురు తెలంగాణ ఆటగాళ్లు
పుదుచ్చేరి : జాతీయ చెస్ చాంపియన్‌షిప్ (అండర్ - 11) విభాగంలో తెలంగాణ ఆటగాళ్లు మెరిశారు. పుదుచ్చేరిలో జరుగుతున్న 29వ జాతీయ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో టాప్-10 లో ముగ్గురు తెలంగాణ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. మూడో స్థానంలో కార్తీక్, ఐదో స్థానంలో కుశాగ్ర మోహన్, ఆరో స్థానంలో రాజా రిత్విక్ నిలిచారు.