మళ్లీ ‘డ్రా'నే.. | Viswanathan Anand Draws vs Magnus Carlsen | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘డ్రా'నే..

Published Wed, Nov 19 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

మళ్లీ ‘డ్రా'నే..

మళ్లీ ‘డ్రా'నే..

ఆనంద్‌ను నిలువరించిన కార్ల్‌సన్  ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్
 
 సోచి (రష్యా): ఆనంద్‌లాంటి అనుభవజ్ఞులను తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమోనని భావించిన డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ ఎనిమిదో గేమ్‌కు పక్కాగా సిద్ధమయ్యాడు. మంగళవారం జరిగిన ఈ గేమ్‌ను నార్వే గ్రాండ్‌మాస్టర్ 41 ఎత్తుల్లో ‘డ్రా'గా ముగించాడు. తెల్లపావులతో క్వీన్స్ గాంబిట్ పద్ధతిలో ఈ గేమ్‌ను ప్రారంభించిన ఆనంద్‌కు ఏ దశలోనూ గెలిచే అవకాశం రాలేదు. 21 ఎత్తులు ముగిశాక ఈ గేమ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫలితం రాదని తేలిపోయింది.

ఏడో గేమ్‌లో 80 ఎత్తుల తర్వాత ‘డ్రా' ఖాయమని తేలినా కార్ల్‌సన్ మొండిగా ఆడుతూ 122 ఎత్తుల వరకు కొనసాగించాడు. ఆనంద్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే కార్ల్‌సన్ ఈ వ్యూహాన్ని అమలు చేశాడు. ఎనిమిదో గేమ్‌లో ఆనంద్‌కూ ఇలాంటి అవకాశం ఉన్నా ఫలితం రాదనే ఉద్దేశంతో ‘డ్రా'కే మొగ్గు చూపాడు. ప్రస్తుతం కార్ల్‌సన్ 4.5-3.5తో ఆధిక్యంలో ఉన్నాడు. బుధవారం విశ్రాంతి దినం. గురువారం జరిగే తొమ్మిదో రౌండ్‌లో కార్ల్‌సన్ తెల్లపావులతో, ఆనంద్ నల్లపావులతో ఆడతారు.
 
 ఈ గేమ్ కోసం కార్ల్‌సన్ బృందం బాగా సన్నద్ధమై వచ్చింది. 9వ ఎత్తులో కార్ల్‌సన్ రూక్ ఈ8 ఆడాడు. ఇది చాలా కొత్త మూవ్. దీనిని ఆనంద్ ఊహించలేదు. అక్కడి నుంచి తను బాగా ఆలోచనలో పడ్డాడు. దీనికి తోడు ఆనంద్ ఆడిన ప్రతి మూవ్‌కీ కార్ల్‌సన్ ముందుగానే సన్నద్ధమై వచ్చాడు. ఆనంద్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ‘డ్రా’ తప్ప మరో ప్రత్యామ్నాయం లేకపోయింది.

ఇక ఆనంద్ మిగిలిన నాలుగు గేమ్స్‌లో రెండు బ్లాక్స్‌తో ఆడాలి. ఈ రెండు గేమ్స్‌లోనూ కార్ల్‌సన్ కచ్చితంగా వైట్స్‌తో విజయం కోసం ప్రయత్నిస్తాడు. మిగిలిన రెండు వైట్స్‌తో ఆడే గేమ్స్‌లో ఆనంద్ పుంజుకోకపోతే కష్టం.    
 - హరికృష్ణ, గ్రాండ్ మాస్టర్
 
 గేమ్ సాగిందిలా...
 1. d4Nf6 2. c4e6 3. Nf3d5 4. Nc3Be7 5. Bf4O-O 6. e3c5 7. dxc5Bxc5 8. a3Nc6 9. Qc2Re8 10. Bg5Be7 11. Rd1Qa5 12. Bd3h6 13. Bh4dx-c4 14. Bxc4a6 15. O-Ob5 16. Ba2Bb7 17. Bb1Rad8 18. Bxf6Bxf6 19. Ne4Be7 20. Nc5Bxc5 21. Qxc5b4 22. Rc1bxa3 23. bxa3Qx-c5 24. Rxc5Ne7 25. Rfc1Rc8 26. Bd3Red8 27. Rxc8Rxc8 28. Rxc8+Nxc8 29. Nd2Nb6 30. Nb3Nd7 31. Na5Bc8 32. Kf1Kf8 33. Ke1Ke7 34. Kd2Kd6 35. Kc3Ne5 36. Be2Kc5 37. f4Nc6 38. Nxc6Kxc6 39. Kd4f6 40. e4Kd6 41. e5+ 1/2,1/2.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement