
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు ఏడో రౌండ్‌లో ఓటమి ఎదురైంది. రష్యా గ్రాండ్‌మాస్టర్ వ్లాదిమిర్ క్రామ్నిక్‌తో శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో ఆనంద్ పరాజయం చవిచూశాడు. క్రామ్నిక్ 36 ఎత్తుల్లో ఆనంద్ ఆటకట్టించాడు. ఈ రౌండ్ ముగిసేసరికి భారత వెటరన్ గ్రాండ్‌మాస్టర్ 4 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. క్రామ్నిక్ 4.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.